టీ మీడియా, అక్టోబర్ 30,మధిర:
ఉత్తమ తహసీల్దార్ గా ప్రశంసాపత్రాన్ని అందుకున్న డి సైదులు ను మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాసిల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సంధర్బంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ.. మధిర మండల తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్న రైతులు,ఇతరుల కు సకాలంలో అందుబాటులో ఉంటూ ధరణి సమస్యలను అదేవిధంగా కోవిడ్,తుఫాన్ విపత్కర సమయంలోనూ సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతూ ప్రజల అందరి ప్రశంసలు అందుకుంటున్న తహసీల్దార్ సైదులు కు ఈ చిరు సత్కారం చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్,మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, కాంగ్రెస్ నాయకులు ,ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు.