టీ మీడియా, డిసెంబర్ 13, మహానంది:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా గ్రామాల్లో లబ్ధిదారులను వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారని మండల టిడిపి నాయకులు మహానంది తహసీల్దార్ జనార్ధన్ శెట్టి, ఎంపీడీవో సుబ్బరాజు లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ టి ఎస్ పథకంలో భాగంగా పదివేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు అందరికి కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త పాట పాడుతుందిని గతంలో బకాయి లేని వాళ్లకు కేవలం పది రూపాయలకే ఇవ్వబడుతుందని పేర్కొనడం బాధితులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. పేద ప్రజల పై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉచితంగా అందించాలని కోరారు. మహానంది మండలంలోని లబ్ధిదారులను వేధింపులకు గురి చేయకుండా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహానంది మండల టిడిపి అధ్యక్షుడు ఉల్లి మధు, ఆర్ యస్ గాజులపల్లె సర్పంచ్ అస్లాం, మండల నాయకులు శివ మహేశ్వర రెడ్డి, బొల్లవరం రామకృష్ణ, భాష, తదితరులు పాల్గొన్నారు.