టీ మీడియా దమ్మపేట డిసెంబర్ 28
మండలం లోని మందలపల్లి గ్రామ పంచాయతీ లో మంగళవారం ఉదయం 10 గంటలకి గ్రామ సభ నిర్వహించగా కనీసం 5 మంది కూడా గ్రామసభ కు హాజరుకాలేదు.ఇందులో విచిత్రం ఏమిటంటే సభ ఏర్పాటు చేసిన పంచాయతీ సిబ్బంది కానీ , పంచాయతీ సెక్రటరీ కానీ,సర్పంచ్ మడివి దుర్గ కానీ,ఉపసర్పంచ్ గారపటి సూర్యం కానీ,కనీసం 14 మంది వార్డు నెంబర్లలో ఏ ఒక్కరు కూడా సభా ప్రాంగణంలో లేకపోవటం చర్చనీయంశంగా మారింది.సభ నిర్వహిస్తున్నట్లు గ్రామంలో చాటింపు వేసినప్పటికి ప్రజలు కూడా సభ కు రాని పరిస్థితి ఇక్కడ చోటుచేసుకుంది.ప్రజలు రాకపోటానికి గ్రామంలో సమస్యలు లేవా? లేకపోతే చెప్పిన సమస్యలకి పరిష్కారం ధోరకదన్న భావన లో ఉన్నారా అనేది ఆలోచించాల్సిన విషయమే.
2019 తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ గత నాలుగు నెలల క్రితమే వచ్చిన 15 సి.సి రోడ్లు మంజూరు అయినవి కానీ ఇప్పటివరకూ వాటిని పొయ్యాక పోవటం ఏమిటని కొందరు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.మరి గ్రామపంచాయతీ లో పనిచేసే యంత్రాంగ సిబ్బందికి ఒకరంటే ఒకరికి పడటంలేదని అనోట ఈ నోటా వింటున్న మాట,అందుకనే గ్రామ సభ కు వస్తే ప్రజలు నిలదీస్తారు అని అడుగుతారేమో రాలేదని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. అందువల్లనే సభ జనాలు లేక వేల వేల బోయిందని చర్చించుకుంటున్నారు.
