మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు
టీ మీడియా,జూలై 8,జన్నారం:
జన్నారం మండల కేంద్రంలో మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గా 58వ పుట్టినరోజు ను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు మామిడిపెళ్లి ఇందయ్య మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ అప్పటి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గఉన్నప్పుడు చిన్నపిల్లల కు గుండె ఆపరేషన్లు కోసం ఉచిత వైద్యం చేయాలని పోరాటం చేసిన వ్యక్తి అని,అలాగే వికలాంగుల హక్కుల పట్ల సరైన న్యాయం చేయాలని వారికి ఫించన్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా గొప్ప వ్యక్తి అని తెలిపారు..అలాగే ఎం ర్ పి ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 28 సంవత్సరాలు గడిచాయని తెలిపారు..
Also Read : పందుల బెడద తొలగించండి.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు బోర్లకుంటా ప్రభుదాస్ ,నాయకులు దూమల్ల ప్రశాంత్,ప్రవీణ్,రత్నం,లచ్చన్న,జంగంరవి,దూమల్లరమేష్,రాజేష్,ప్రభుదాస్,సునీల్,జైకుమార్,సురేష్,ఏసుదాస్,అజేయ్ తదితరులు పాల్గొన్నారు..
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube