మాండూస్‌ ఎఫెక్ట్‌..

చెన్నై అస్తవ్యస్తం

1
TMedia (Telugu News) :

మాండూస్‌ ఎఫెక్ట్‌..

– చెన్నై అస్తవ్యస్తం

టి మీడియా, డిసెంబర్ 10,చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్‌ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాకా ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా వాయువ్య దిశగా పయనిస్తున్న మాండూస్‌ తుపాను.. శనివారం మధ్యాహ్నానికి మరింతగా బలహీనపడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. కాగా, తుపాను తీరం దాటే సమయంలో తమిళనాడులోని చెన్నై సహా చెంగల్‌పట్టు, విల్లుపురం, కాంచీపురం, కరైకల్‌, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ గాలులకు పలు ప్రాంతాల్లోని భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఒక్క చెన్నై నగరంలోనే దాదాపు 200కిపైగా చెట్లు నేలకూలినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు మాండూస్‌ తుపాను కారణంగా చెన్నై, చెంగల్‌పట్టు, కరైకల్‌, మహాబలిపురం, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Also read : గుజ‌రాత్ నుంచి గెలిచిన ఏకైక ముస్లిం ఎమ్మెల్యే

పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. చెన్నై టీ-నగర్‌లో గోడ కూలడంతో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తుపాను నేపథ్యంలో చెన్నై తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తీరప్రాంతం వెంట ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సిద్ధం చేసింది. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, కాలకురిచ్చి, వేలూరు, రాణిపేట్‌ జిల్లాల్లోని విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube