టీ మీడియా, నవంబర్ 26, మంగపేట
భారత విద్యార్థి సమైక్య (ఎస్.ఎఫ్.ఐ)ఆధ్వర్యంలో శుక్రవారం మంగపేట మండలం కత్తి గూడెం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ మంగపేట మండల ఉపాధ్యక్షుడు ఎం,డి మేరాజ్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థులు అడిగి వారి సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. పాఠశాలలోఉపాధ్యాయుల కొరతఉన్నట్లు, ముఖ్యంగా తెలుగు సామాన్య శాస్త్రం లేనట్లు తరగతి గదిలో ఫ్యాన్లు కిటికీలు ఫర్నిచర్ కాంపౌండ్ వాళ్ళు లేక తరగతి గదిలోకి పాములు తేళ్ళు రావటం వలన అదేవిధంగా పాఠశాల బిల్డింగ్ వర్షం పడటం వలన గదుల్లో చమ్మ దిగుతుంది ఇలా ఉండటం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వారు అన్నారు.

విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రఘు ,మురళి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
