కార్బైడ్ రహిత మామిడి పండ్ల మేళా ను ప్రారంభించిన మేయర్

కార్బైడ్ రహిత మామిడి పండ్ల మేళా ను ప్రారంభించిన మేయర్

1
TMedia (Telugu News) :

కార్బైడ్ రహిత మామిడి పండ్ల మేళా ను ప్రారంభించిన మేయర్

టీ మీడియా, ఫిబ్రవరి 21,ఖమ్మం : పెవిలియన్ గ్రౌండ్ నందు ఉత్తమ రైతు బాణోతు లక్ష్మణ్ నాయక్ ఏర్పాటు చేసిన కార్బైడ్ రహిత మామిడి పండ్ల మేళా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ పూనుకొలు నీరజ , అసిస్టెంట్ కమిషనర్ నాగమల్లీశ్వరి , కార్పోరేటర్లు పాలెపు వెంకటరమణ , బుడిగం శ్రీనివాసరావు , జక్కుల లక్ష్మయ్య లు పాల్గొని ప్రారంభించి మాట్లాడారు . గోవింద్రాల గ్రామం , కామేపల్లి మండలం , ఖమ్మం జిల్లా మామిడి పండ్ల ఆదర్శ రైతుగా గుర్తింపు పొంది గత పది సంవత్సరాల నుండి నేరుగా కస్టమర్లకు అతి తక్కువ ధరలకే అందిస్తూ వారి మన్ననలు పొందుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన మామిడి పండ్లను అందిస్తున్నారని తెలిపారు . కావున నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also Read : రాశి సీడ్స్ పత్తి పంట పై రైతు సంవృద్ధి సదస్సు

అనంతరం ఉత్తమ రైతు బాణోతు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ప్రజలకు కార్బెడ్ రహిత మామిడి పండ్లను అందించుటే మా లక్ష్యం అని ఒకసారి సందర్శించి మధురమైన మామిడి పండ్ల రకాలను ఆస్వాదించాలని కోరారు . అలాగే ప్రస్తుతం మార్కెట్లోకి చిన్న రసం , బంగినపల్లి మామిడి పండ్లను తీసుకొచ్చామని వారంలో చెఱుకు రసం , దశరి , హిమాయత్ , చిన్న రసం , పెద్ద రసం , సువర్ణరేఖ , అల్ఫోన్సో , మల్లిక , పచ్చడి మామిడి కాయలు , తెల్ల గులాబి , జలాలు , నీలం మరెన్నో నాటు రకాలు మార్కెట్లోకి వస్తాయని మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్ ను 9908848371, 9676828365 సంప్రదించగలరు అన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube