క్రీడాకారిణి కి మంత్రి అభినందన

క్రీడాకారిణి కి మంత్రి అభినందన

1
TMedia (Telugu News) :

క్రీడాకారిణి కి మంత్రి అభినందన

టి మీడియా,జూన్15, మహబూబ్ నగర్: జూన్ 6 నుండి 13 తేదీలలో థాయిలాండ్ లో జరిగిన 14వ ఆసియా వాలీబాల్ మహిళల అండర్ 18 కేటగిరి చాంపియన్ షిప్ లో భారతజట్టు తరుపున ప్రాతినిధ్యం వహించికె.శాంతాకుమారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ గురుకుల పాఠశాలలో చదువుకుని, అండర్ 18 కేటగిరి వాలీబాల్ భారత జట్టుకు,తెలంగాణ నుండి ఎంపికయిన తొలిబాలిక శాంతాకుమారి అని మంత్రి అన్నారు. శాంతాకుమారి, స్వగ్రామం వనపర్తి మండలం చిట్యాల తూర్పుతండా అని తెలిపారు.

Also Read : క్లినికల్ ల్యాబ్ నిర్మాణానికి విరాళం

క్రీడలలో రాష్ట్ర పేరును నిలబెడుతున్న శాంతాకుమారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలోశాంతాకుమారిని, ఘనంగా సన్మానించారు.లక్షరూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తామని మంత్రి సత్వవతి రాథోద్ గారు అన్నారు. సీఎం కేసీఆర్‌ గారు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని మంత్రి అన్నారు.ఇలాగే మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రం మరియు దేశం పేరు నిలబెట్టాలని శాంతకుమారిని మంత్రి ప్రోత్సహించారు.

Also Read : మూడేళ్ల పాలనలో నకిలీ రత్నాలుగా నవరత్నాలు

నిరుపేద కుటుబాలకు చెందిన పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేందుకు ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాలునేడు ఎంతో మంది నిరుపేద విద్యార్థులు విద్య, క్రీడల్లో రాణిస్తూ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube