-కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపిన రేగా కాంతారావు.
-సింగరేణి బొగ్గు తెలంగాణ హక్కు. పోశంనరసింహరావు
సింగరేణి బొగ్గు గనుల వేలం నిలపాలని బిజెపి ప్రభుత్వం పై కన్నెర్ర చేసిన మణుగూరు ఏరియా కార్మిక వర్గం , సింగరేణి లోని నాలుగు బొగ్గు బ్లాక్ లను కేంద్ర బిజెపి ప్రభుత్వం బహిరంగంగా వేలం వేసే కుట్రను నిరసిస్తూ మణుగూరు టిబిజికేయస్- జె. ఏ. సి ఆధ్వర్యంలో తలపెట్టిన 72 గంటల సమ్మె విజయవంతం గా ముగిసింది.
మణుగూరు ఏరియా కార్మిక వర్గం ఏకతాటిపైకి వచ్చి మూడు రోజుల పాటు స్వచ్చందంగా విధులకు దూరంగా ఉండి సమ్మెను విజయవంతం చేశారు.కూనవరం రైల్వే గెట్ దగ్గర టిబిజికేయస్-జె. ఏ. సి నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీటీసీ పొశం నర్సింహ రావు , టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరై సింగరేణి బొగ్గు బ్లాక్ ల ప్రయివేటికరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి ఉండగా నిలుస్తామని వారు తెలిపారు.
జెడ్పీటీసీ పొశం నర్సింహా రావు మాట్లాడుతూ … సింగరేణి బొగ్గు తెలంగాణ హక్కు అని బొగ్గు బ్లాక్ ల ప్రయివేటికరణ బిజెపి ప్రభుత్వం ఉపసంహరణ చేసుకునే వరకు పోరాటం చేయవలసిందేనని కార్పొరేట్ శక్తులకు బోగ్గు గనులు కట్టబెట్టేందుకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలు పోరాటం తోనే తిప్పికొట్టాలని అందుకు కార్మిక వర్గం సమాయత్తం గా ఉండాలని తెలిపారు.
సమ్మె లో మణుగూరు ఏరియా కార్మిక వర్గం స్వచ్ఛందంగా విధులకు దూరంగా ఉండి సమ్మెను విజయవంతం చేయడం అభినందనీయమని తెలిపారు. సమ్మె ను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం, కార్మికులకు అనేక తాయిలాలు ప్రకటించి కార్మికులను ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కార్మిక ఐక్యత ముందు అవి పని చేయలేదని ఇదే ఒరవడి రానున్న రోజుల్లో కూడా చాటాలనిపిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొశం నర్సింహ రావు, మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు , లెవెన్ మెన్ కమిటి సభ్యులు సామ శ్రీనివాస రెడ్డి, కేంద్ర డిప్యూటి జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవూఫ్ టిబిజికేయస్ నాయకులు వీర భద్రయ్య, కోట శ్రీనివాసరావు, బిఎంఎస్ నాయకులు వీరమనేని. రవీందర్, శివ రావు, నరేష్, మల్లికార్జున్, సి. పి యం నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, అన్ని గనుల, డిపార్ట్ మెంట్ ల టిబిజికేయస్ ఫిట్ సెక్రటరీ లు, ఫిట్ కమిటీ సభ్యులు,శ్రేణులు పాల్గొన్నారు .