గారాపాటి అధ్వర్యంలో ఎంపి నామా సమక్షంలో బిఆర్ఎస్ లోకి పలువురు చేరికలు.

గారాపాటి అధ్వర్యంలో ఎంపి నామా సమక్షంలో బిఆర్ఎస్ లోకి పలువురు చేరికలు.

0
TMedia (Telugu News) :

గారాపాటి అధ్వర్యంలో ఎంపి నామా సమక్షంలో బిఆర్ఎస్ లోకి పలువురు చేరికలు…..

టీ మీడియా,జనవరి 28, అశ్వారావుపేట : నియోజవర్గంలోని దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో పలువురు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దిశా కమిటీ సభ్యుడు మందలపల్లి ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ బిఆర్ఎస్ లోకసభ పక్ష నేత నామ నాగేశ్వరరావు సమక్షంలో శనివారం ఖమ్మం లోనీ ఆయన నివాసంలో పార్టీలో చేరిన న్యాయవాదులు సోడెం వెంకట్, అద్దంకి మధు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వెల్లడించారు. ఎంపీ నామ మాట్లాడుతూ తెలగాణ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు భారతదేశానికే ఆదర్శం అని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్న బిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ అభివృద్ధి కి కృషి చేయాలని కష్టపడి పనిచేసుకుంటూ పోతే పార్టీ కచ్చితంగా గుర్తిస్తుంది అని అన్నారు.

Also Read : సాంఘిక సంక్షేమ పాఠశాల,కళాశాలలో దుప్పట్లు పంపిణీ

కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు , పార్టీ నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, స్థానిక నాయకులు కనపర్తి ధర్మారావు, చింతలచెరువు భాగ్యరాజు మద్దెల పుల్లారావు నందికోల రామారావు, అయినంపూడి సంతోష్, తోట గోపి,ఎడవల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube