కాజీపేట- విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు

కాజీపేట- విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు

0
TMedia (Telugu News) :

కాజీపేట- విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు

టీ మీడియా, డిసెంబర్ 4, వరంగల్‌ : కాజీపేట-వరంగల్‌ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ ఈ నెల 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్‌- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 7వ తేదీతోపాటు 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్‌-భద్రాచలం రోడ్డు కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 6వ తేదీతోపాటు, 10 నుంచి 18 వరకు, ఆదిలాబాద్‌-తిరుపతి కఅష్ణా ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 5 నుంచి 19 వరకు రద్దు చేశారు.కాజీపేట-డోర్నకల్‌, డోర్నకల్‌-విజయవాడ ప్యాసింజర్‌ పుష్‌ఫుల్‌ రైళ్లను ఈ నెల 10 నుంచి 18 వరకు, కాజీపేట-తిరుపతి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి రైళ్లను కూడా ఈ నెల 10 నుంచి 18 వరకు రద్దు చేశారు. అలాగే గోల్కండ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 11 నుంచి 19 వరకు కాజీపేట వరకు మాత్రమే నడుస్తుంది. భద్రాచలం రోడ్‌ నుంచి బల్లార్షా వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 6 నుంచి 8 వరకు, 10 నుంచి 19 వరకు హసన్పర్తి రోడ్‌ వరకు మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

Also Read : శీతాకాలం ఆల‌స్య‌మైనా.. రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube