కొండాపురం శివారులో వెలసిన మావోయిస్టు పోస్టర్లు

0
TMedia (Telugu News) :

టి మీడియా ,డిసెంబర్ 9 వెంకటాపురం:

మూలుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోలీసు ఇన్ఫార్మర్స్క హెచ్చరిక విప్లవోద్యమాన్ని నిర్మూలించే పథకంతో దోపిడీ పాలకవర్గాల పోలీసులు ప్రజలను మావోయిస్టు పార్టీకి సహకరిస్తూన్నారని -అరెస్టులు చేసి బెదిరిస్తూ , డబ్బులు ఆశలు చూపి లొంగదీసుకుంటున్నారు . లంపెన్ను ఇన్ఫార్మర్స్ మార్చుకొని శికారు పేరుతో వాగులు , నీళ్ళు ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ మకాం ( డేరా ) లు చూసి ఫోన్ , వాట్సాప్ ద్వారా పోలీసులకు వెంటనే సమాచారం అందిస్తున్నారు . గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ” ఇస్తున్నారు . బొల్లారం గ్రామానికి చెందిన శ్యామల ప్రసాద్ , సిద్ది వెంకటలక్ష్మి , కుర్సం రాంబాబు , వెంకవారు గ్రామానికి చెందిన సోడి నర్సింహరావు , కల్పాక గ్రామానికి చెందిన కోరం సత్యం , సీతారాంపురం ! గ్రామానికి చెందిన కుర్సం రాంబాబు , వీరంతా మావోయిస్టుల గురించి పోలీసులకు సమాచారం 1. ఇస్తున్నారు . పోలీసులు చూపే ప్రలోభాలకు ఆశపడి , ప్రజలకు , పార్టీకి ద్రోహం తలపెట్టే తప్పుడు • పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల అభిప్రాయం మేరకు వీరికి శిక్ష తప్పదని మా ఏరియా కమిటీ హెచ్చరిస్తుంది . విప్లవాభివందనాలతో , వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ , సీపీఐ ( మావోయిస్టు ) .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube