మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు

మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు

0
TMedia (Telugu News) :

మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు

టీ మీడియా,జూన్ 1 వెంకటాపురం:

ములుగు జిల్లా ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ వాజేడు , వెంకటాపురం ఏరియా కమిటీ సెక్రటరీ అయిన సుధాకర్ కు కొరియర్ లుగా పని చేస్తూన ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల తెలిపినా వివరాల ప్రకారం ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టులకు అగ్రనాయకులు, దళ సభ్యుల మరికొంత మంది వాజేడు గ్రామంలో జరిగే రోడ్డు వర్క్ మిషన్ లను తగలబెట్టి, అటుగా వచ్చే పోలీస్ పార్టీని ల్యాండ్ మైన్ పెట్టి చంపాలని కుట్ర పన్నుతున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వెంకటాపురం సీఐ శివప్రసాద్ వాజేడు ఎస్ఐ రేఖ అశోక్ పోలీస్ సిబ్బంది సీఆర్ పీఎఫ్ 39 సి కంపెనీతో కలిసి వాజేడు నుంచి గుమ్మడి దొడ్డి దారిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.

also read :భూముల ధరలను పెంచ్చనున్న సర్కార్‌

 

వాజేడు గ్రామ శివారులోని కల్వర్ట్ సమీపంలో నలుగురు వ్యక్తులు పుల్లూరి నాగరాజు తండ్రి రాములు 25,వావిలాల నర్సింగరావు తండ్రి సత్యం 26,ఏం పెళ్లి జాషువా తండ్రి సత్యం 26, మోటార్ సైకిల్ మీద ఒక బస్తా పెట్రోల్ టిన్ తో గుమ్మడిదొడ్డి వైపు నుండి వాజేడు వైపు వస్తూ, పోలీస్ పార్టీని చూసి పారిపోవటానికి ప్రయత్నించగా, పోలీస్ వారు వారిని పట్టుకొని వారి వద్ద ఉన్న బ్యాగ్ ని చెక్ చేయగా అందులో కొన్ని ప్రేలుడు పదార్ధాలు ఉండటంతో అనుమానం వచ్చి విచారించారు.ముగ్గురు కలిసి ప్రేలుడు సామాగ్రిని తీసుకొని గుమ్మడిదొడ్డిలోని పెట్రోల్ బంక్ కి వెళ్ళి అక్కడ బంక్ ఓనర్ అయిన కంబాలపల్లి గణపతికి కలవగా, సుధాకర్ ఆదేశాల మేరకు వారి ముగ్గురికి రోడ్డు వర్క్ మిషనరీలను తగలబెట్టటానికి అవసరమయ్యే పెట్రోల్ (10) లీ, మరియు వార ఖర్చుల నిమిత్తం రూ. 5000/- నగదు యిచ్చి అక్కడి నుండి వారు ముగ్గురు కలిసి వాజేడు వైపు రోడ్డు వర్క్ మిషన్ లను తగలబెట్టడానికి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి కార్డెక్స్ వైర్ 5 మీటర్లు, ఒక డిటోనేటర్లు, పెట్రోల్ టిన్,మ్యాచ్ బాక్స్,మూడు మొబైల్ ఫోన్, రెండు బ్యాటరీలు,ఎలక్ట్రికల్ వైర్ 10 మీటర్లు,మోటార్ సైకిల్ టీ స్ 25 ఏ 7791,టిఫిన్ బాక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన మావోయిస్టులను, వారికి సహకరించిన పెట్రోల్ బంక్ యజమానిని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు పోలీసులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube