ఆర్టీసీ బస్సును దహనం చేసిన మావోయిస్టులు

ఆర్టీసీ బస్సును దహనం చేసిన మావోయిస్టులు

0
TMedia (Telugu News) :

ఆర్టీసీ బస్సును దహనం చేసిన మావోయిస్టులు

టీ మీడియా, డిసెంబర్ 21,రాయ్ పూర్ : చత్తీస్ గఢ్-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చింతూరు మండలంలో బుధవారం రాత్రి ఆర్ టిసి బస్సుతో పాటు రెండు ట్రక్కులను మావోయిస్టులు దగ్ధం చేశారు.రాత్రి 8:30 గంటలకు జగదల్పూర్ నుండి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఆసీర్ గూడెం గ్రామo వద్ద మావో యిస్టులు నిలిపివేసి దగ్ధం చేశారు.అలాగే మరో రెండు ట్రక్కులను డీజిల్ పోసి దగ్ధం చేశారు. చింతూరుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఆశీర్వాదం గ్రామo వద్ద తాగు నీరు కోసం ప్రయాణికులు దిగిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుందని సమాచారం.ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగ లేదని పోలీసులు చెబుతు న్నారు. పంచనామా చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొనిదర్యాప్తు చేపట్టారఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube