మావోయిస్టులు లొంగిపోవాలి

-డీజీపీ మహేందర్‌రెడ్డి

1
TMedia (Telugu News) :

మావోయిస్టులు లొంగిపోవాలి

-డీజీపీ మహేందర్‌రెడ్డి

టీ మీడియా,అక్టోబర్ 19,ములుగు : మావోయిస్టు ఆర్గనైజేషన్‌ మొత్తంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 1 30 మంది వరకు పనిచేస్తున్నారని ముఖ్యంగా సెంట్రల్ కమిటీలోని 20 మందిలో 11 మంది తెలంగాణకు చెందిన వ్యక్తులు ఉన్నారని ఆయన వివరించారు. వీరంతా అజ్ఞాతం వీడి పోలీసుల ఎదుట లొంగి జన జీవన స్రవంతిలో కలిస్తే పునరావసం కల్పిస్తామని తెలిపారు. అందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు సహకారాలు అందజేస్తుందని అన్నారు.

Also Read : ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ జీవో

మావోయిస్టులను అదుపు చేసేందుకు అంతరాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో నిరంతరం పోలీసు ఆపరేషన్స్‌ కొనసాగుతుందని వెల్లడించారు.కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల పోలీసు అధికారులతో సమావేశమై శాంతి భద్రతలపై చర్చించానని, వీరంతా చురుకుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. సీపీఎఫ్, గ్రేహౌండ్స్‌, జిల్లా పోలీసు, ఎన్‌ఐబీ రాష్ట్రంలోని అన్ని విభాగాలు సమర్ధవంతంగా పనిచేస్తూ మావోయిస్టుల చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube