పోలీస్ ఆధ్వర్యంలో 2కే రన్*

టీ మీడియా,మార్చి 08,రామగుండం

0
TMedia (Telugu News) :

పోలీస్ ఆధ్వర్యంలో 2కే రన్*
టీ మీడియా,మార్చి 08,రామగుండం:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు గోదావరిఖని సబ్ డివిజన్ పోలీసు శాఖ నిర్వహించిన 2కే రన్ ఉత్సాహంగా సాగింది. 2కే రన్ ను అడిషనల్ డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్ ఐపిఎస్, గోదావరిఖని ఏ సి పి ఎస్. గిరి ప్రసాద్ లు జెండా ఊపి ప్రారంభించగా..పెద్ద సంఖ్యతో మహిళలు, విద్యార్థినీలు హజరయ్యారు. 2కే రన్ విజేతలుగా నిలిచిన మహిళలు, విద్యా ర్థినీలకు అడ్మిన్ డీసీపీ గారు బహుమతులను అందజేశారు.

also read: సింగరేణిలో భారీ ప్రమాదం

ఈ సందర్బంగా డీసీపీ అడ్మిన్ గారు మాట్లాడుతూ…. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మహిళలు మారుతున్న కాలానికి అనుగుణంగా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.ప్రస్తుతం సమాజంలో మహిళలు అన్నిరం గాల్లో పురుషులతో సమానంగా రాణి స్తున్నారు.ఏ రంగంలోనైనా విజయం సాధించాలన్నా ఆత్మవిశ్వాసం చాలా అవసరమన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.

also read:ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం

ఇట్టి కార్యక్రమానికి గోదావరిఖని గవర్నమెంట్ విద్యార్థులు,విద్యార్థినిలు, డిగ్రీ & జూనియర్ కాలేజ్ విద్యార్థులు, విద్యార్థినిలు,గాంధీ డిగ్రీ కాలేజ్, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, మహర్షి డిగ్రీ కాలేజ్, విద్యార్థులు, విద్యార్థినిలు మరియు సాంస్కృతిక కళాసారథులు, మహిళ కార్పొరేటర్లు, 8ఇంక్లైన్ కాలనీ , కమాన్పూర్,రామగుండం, ఎన్టీపీసీ, అంతర్గం, మహిళలు, మహిళ సంఘాలు మొత్తం 500 మంది పాల్గొన్నారు

also read:ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

ఇట్టి కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎస్.గిరి ప్రసాద్ గోదావరిఖని వన్ టౌన్ స్పెక్టర్ లు రమేష్ బాబు,రాజ్ కుమార్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు సుబ్బారావు, రమేష్, నరేష్ కుమార్, స్వరూప్ రాజ్, సంతోష్, శ్రీధర్,మహిళా ఎస్ఐ.శరణ్య మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube