శ్రీకృష్ణుడికి అంకితమైన మార్గశిర మాసం విశిష్టత

శ్రీకృష్ణుడికి అంకితమైన మార్గశిర మాసం విశిష్టత

0
TMedia (Telugu News) :

శ్రీకృష్ణుడికి అంకితమైన మార్గశిర మాసం విశిష్టత

లహరి, డిసెంబర్ 16, ఆధ్యాత్మికం : తెలుగు మాసాల్లో ఒకొక్క మాసం ఒకొక్క విశిష్టతను కలిగి ఉన్నాయి. కార్తీక మాసం నుంచి నేడు మార్గశిర మాసంలో అడుగు పెడుతున్నాం.. ఈ నేపథ్యంలో హిందూ సనాతన ధర్మంలో మార్గశిర మాసం ప్రాముఖ్యత విశిష్ట గురించి ఈరోజు తెలుసుకుందాం.. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం.. మృగశిర నక్షత్రం… పూర్ణిమ కలయిక వలన ఈ మాసానికి మార్గశీరమని పేరు. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు.. మాసానాం మార్గశీర్షాహం.. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు. ఈ మాసం లో చేసే పూజ, హోమం, అభిషేకం, ఇలా ఏ దైవకార్యం చేసినా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని ప్రకటించాడు. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువుని పూజిస్తారు. ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది. గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొన్నాయి. జ్యోతిష్యాన్ని అనుసరించి ఈ నెలను.. సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధిగాంచింది. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది.

Also Read : నాగ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఆది నారాయణుడు సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మహావిష్ణువు వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించి.. విష్ణు సహస్ర నామం, భగవద్గీత పారాయణ చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది.

– మార్గశిర శుద్ద పంచమి రోజున నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది.
– మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అని.. సుబ్రహ్మణ్యేశ్వర షష్టి అని అంటారు. ఈ షష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామి ని శక్తికొలది పూజిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం.
– మార్గశిర శుద్ద సప్తమిని రథ సప్తమి, భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి.
– మార్గశిర అష్టమి ని కాలభైరవాష్టమి గా పిలుస్తారు. శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాల బైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.

Also Read : ఆ డబ్బు నాది కాదు.. కుటుంబానిది..

– మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వారా దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసం లో వచ్చే ద్వాదశి ని అఖండ ద్వాదశి అంటారు.
– మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమత్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు.
మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామీ ని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.
– మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఈరోజున యమధర్మ రాజుని పూజిస్తారు. ఈ పున్నమిని ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
– మార్గశిరమాసంలోని గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈరోజు లక్ష్మీదేవిపూజకు, దత్తాత్రేయుని పూజించుటకు విశేషమైనది. ఈరోజు చేసే లక్ష్మీపూజలు వల్ల దరిద్రం తొలగిపోయి.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు, పరాశరుడు తెలిపినట్లు పురాణాల కథనం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube