వైపు లైన్ పనులకు శంకుస్థాపన చేసిన మార్కెట్ చైర్మన్

వైపు లైన్ పనులకు శంకుస్థాపన చేసిన మార్కెట్ చైర్మన్

1
TMedia (Telugu News) :

వైపు లైన్ పనులకు శంకుస్థాపన చేసిన మార్కెట్ చైర్మన్

టీ మీడియా, మార్చి17, మధిర:

మండల పరిధిలోని ఆత్కూరు గ్రామంలో కేసిఆర్ కాలనీలో తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామ సర్పంచి అబ్బూరి సంధ్య రాణి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు విన్నవించగా వెంటనే స్పందించి జడ్పీ నిధుల నుండి ఐదు లక్షల రూపాయలను విడుదల చేశారనీ ఆ పైప్లైన్ పనులకు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు
శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్పీ నిధుల నుండి ఐదు లక్షలు మంజూరు చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నియోజకవర్గ విభాగం కన్వీనర్ కో న నరేందర్ రెడ్డి, అబ్బూరి రామన్,యం. వెంకయ్య, టిఆర్ఎస్ నాయకులు నల్లమల శ్రీనివాసరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : అర్హులందరికీ సంక్షేమ పథకాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube