మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ.

మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ.

1
TMedia (Telugu News) :

మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ.

 

టీ మీడియా, సెప్టెంబర్ 28,ఖమ్మం బ్యూరో: నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టారు. ఖమ్మం నగరం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సమీకృత వెజ్‌ & నాన్‌వెజ్‌ మార్కెట్‌ను ఆధునాతనంగా నిర్మించనున్నారు.

Also Read : బతుకమ్మ చీరల పంపిణీ

ఖమ్మం నగరంలోని ఖానాపురంలో రూ.4.50కోట్లు, వీడిఓస్ కాలనీలో రూ.4.50కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత వెజ్‌ & నాన్‌-వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మేయర్ పునుకొల్లు నీరజ తో కలిసి పరిశీలించారు. వీడిఓస్ కాలనీ లోని ఒక్కో మార్కెట్ నకు 2.01 ఎకరాల్లో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లో 65-వెజ్ స్టాల్స్, 23-ఫ్రూట్ స్టాల్స్, 46 నాన్-వెజ్ స్టాల్స్ మొత్తం-134 స్టాల్స్ తో అన్ని సౌకర్యాలు ఒకే చోట ప్రజలకు కావలసినవి అందుబాటులో ఉండనున్నాయని మంత్రి పువ్వాడ వివరించారు. ఇప్పటికే పనుల్లో తీవ్ర ఆలస్యం అయ్యాయని ఆయా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube