జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణం

కన్నుల పండుగగా వీక్షించిన భక్తులు

1
TMedia (Telugu News) :

జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణం

-కన్నుల పండుగగా వీక్షించిన భక్తులు

-మహా అన్నదాన కార్యక్రమం

టీ మీడియా, ఆగస్టు 9, ఖమ్మం : శ్రావణ మాసం రెండోవ మంగళవారం పురస్కరించుకుని కాల్వొడ్డు మున్నేరు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఎల్లమ్మ – జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణాని ఆలయ పూజారి ఉప్పిసాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . గత పది సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట , నల్లగొండ , విజయవాడ , ఇల్లందు చుట్టూ పక్కాల తీరుప్రాంతాల నుండి ప్రజలు పాల్గొని కన్నుల పండుగగా తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు . ఉదయం తొమ్మిది గంటలకు నల్గుగు ఆ తర్వాత ఎదుర్కోలు , ఒడిబియ్యం బోనాలు సమర్పించారని అన్నారు.

 

Also Read : బీజేపీకి గుడ్‌బై చెప్పిన బీహార్ సీఎం

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా 47వ డివిజన్ కార్పొరేటర్ మాటేటి అరుణ నాగేశ్వరరావు తెరాస యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్ , నాయకులూ మాటేటి రవి పాల్గొన్నారు . ఈ కల్యాణంలో ఎల్లమ్మ అమ్మవారి (అమ్మాయి) తరపున పీఠలమీద చౌడవరపు నాగేశ్వరరావు – అరుణకుమారి దంపతులు , జగద్ అగ్ని మునిరాజు స్వామివారి ( అబ్బాయి ) తరపున పమిడీ మర్రి కృష్ణ మోహన్ – కృష్ణ కుమారి దంపతులు కూర్చుని వివాహం జరిపించారని పేర్కొన్నారు . అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . అన్నదాతలు కాకరపర్తి వినయ్ కుమార్ – స్వాతి దంపతులు దాదాపు ఐదు వందల మంది భక్తులు పాల్గొని విజయవంతం చేశారు . సైదులు , యాదగిరి , ఝాన్సీ , రాజమ్మ , సుభద్రమ్మ , కుమారి తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube