పెండ్లి ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

40 మందికి తీవ్ర గాయాలు

1
TMedia (Telugu News) :

పెండ్లి ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

-40 మందికి తీవ్ర గాయాలు
టి మీడియా, మే 23,భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెండ్లి ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మొండి కట్ట గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read : ఎమ్మెల్సీ అనంత బాబు దిష్టిబొమ్మ దగ్ధం

పాల్వంచ మండలం, మందరికల పాడు గ్రామం నుంచి పెండ్లికి వెళ్తున్న ట్రాక్టర్.. మొండి కట్ట గ్రామం దగ్గర మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube