అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

0
TMedia (Telugu News) :

తన కూతుర్ని హత్య చేశారంటూ మృతురాలి తల్లి ఫిర్యాదు

తన కూతురు మృతికి కారకులైన మహేష్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన ప్రజలు

విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎస్ఐ

టీ మీడియా,మధిర, నవంబర్ 17 :

మధిర మున్సిపాలిటీ పరిధిలోని అంబారు పేట గ్రామానికి చెందిన షేక్ సైదాబీ (32) ఫ్యానుకు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమెకు భర్త ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మృతిపై అనేక అనుమానాలను ఉన్నాయని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని అంబారుపేట ప్రజలు బుధవారం టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు దీనిపై టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ విచారణ చేసి సైదాబీ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మృతురాలు తల్లి మహమ్మద్ వాలియాభి మాట్లాడుతూ తన కుమార్తె సైదాబీని మధిర మండలం నిదానపురం గ్రామానికి చెందిన పగిడిపల్లి మహేష్ అనే యువకుడు కొంతకాలంగా తన కూతురు వెంటపడుతూ, ప్రేమిస్తున్నానని, కోరిక తీర్చమని వేధిస్తున్నారని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆమె తెలిపారు.

ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని తాము ఎవరి దృష్టికి తీసుకు వెళ్లలేదని ఆమె తెలిపారు. పగిడిపల్లి మహేష్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఈనెల 16వ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆటోలో వచ్చి సైదాబీని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్కు చీరేతో ఉరి వేసి పరారైనట్లు ఆమె ఆరోపించారు. సైదాబీ నివాసంలో మహేష్ చెప్పులు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి పగిడిపల్లి మహేష్ తో పాటు అతనికి సహకరించిన వారిపై హత్య కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

mother complained her daughter has been murdered
Married man dies under suspicious circumstances.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube