కోడ‌లికి మ‌రో వివాహం చేసిన అత్త‌మామ‌

గిఫ్ట్‌గా రూ. 60 ల‌క్ష‌ల ఆస్తి

1
TMedia (Telugu News) :

కోడ‌లికి మ‌రో వివాహం చేసిన అత్త‌మామ‌..

గిఫ్ట్‌గా రూ. 60 ల‌క్ష‌ల ఆస్తి
టి మీడియా,మే14, భోపాల్ : ఈ అత్త‌మామ‌లు స‌మాజానికి ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచారు. భ‌ర్త చ‌నిపోతే భార్య‌ను వితంతువుగా ప‌రిగ‌ణించే రోజుల‌కు కాలం చెల్లింద‌ని నిరూపించారు. క‌రోనాతో భ‌ర్త‌ను కోల్పోయిన ఓ మ‌హిళ‌కు అత్తామామ‌లే ద‌గ్గరుండి వివాహం జ‌రిపించారు. పెళ్లి చేసి కోడ‌లికి కొత్త జీవితాన్ని ప్ర‌సాదించారు. అంతే కాదు.. రూ. 60 ల‌క్ష‌ల విలువైన ఆస్తిని రాసిచ్చారు అత్త‌మామ‌లు.వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని థార్ జిల్లాకు చెందిన యుగ్ ప్ర‌కాశ్ తివారీ బ్యాంకు రిటైర్డ్ మేనేజ‌ర్. ఈయ‌న‌కు భార్య‌, కుమారుడు ప్రియాంక్తివారీ ఉన్నారు. ప్రియాంక్ తివారీకి భార్య రీచా, కూతురు అన‌న్య తివారీ(9) ఉన్నారు. క‌రోనాతో ప్రియాంక్ తివారీ గ‌తేడాది చ‌నిపోయాడు. అప్ప‌ట్నుంచి ఆ కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. రీచా త‌న భ‌ర్త గురించే ఆలోచిస్తూ మాన‌సికంగా కుంగిపోతుండ‌టాన్ని యుగ్ ప్ర‌కాశ్ గ‌మ‌నించాడు.

Also Read : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు గంగుల , పువ్వాడ పర్యటన

కోడ‌లిని కూతురిలా భావించి..ఇక యుగ్ ప్ర‌కాశ్ దంప‌తులు కోడలు రీచాను కూతురిలా భావించారు. ఆమె కొత్త జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో రీచాకు మ‌రో పెళ్లి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో నాగ్‌పూర్‌కు చెందిన వ‌రుణ్ మిశ్రాతో రీచాకు ద‌గ్గ‌రుండి అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేశారు. అది కూడా అక్ష‌య తృతీయ రోజున వివాహం జ‌రిపించి.. కొత్త జీవితాన్ని ప్ర‌సాదించారు.
గిఫ్ట్‌గా రూ. 60 ల‌క్ష‌ల ఆస్తినాగ్‌పూర్‌లో ప్రియాంక్ తివారీ కొనుగోలు చేసిన ఓ భ‌వ‌నాన్ని( రూ. 60 ల‌క్ష‌ల విలువ‌) రీచాకు బ‌హుమ‌తిగా ఇచ్చారు. రీచా భ‌విష్య‌త్‌లో ఉన్న‌తంగా బ‌త‌కాల‌నే ఉద్దేశంతోనే ఆ భ‌వ‌నం రాసిచ్చామ‌ని యుగ్ ప్ర‌కాశ్ దంప‌తులు తెలిపారు. వివాహం అనంత‌రం వ‌రుణ్ మిశ్రాతో క‌లిసి రీచా, కూతురు అన‌న్య నాగ్‌పూర్ వెళ్లిపోయారు. కోడ‌లికి మ‌రో పెళ్లి చేసిన యుగ్ ప్ర‌కాశ్ దంప‌తుల‌పై ప్ర‌శంస‌లు వెలువెత్తుతున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube