అమరవీరుల స్మారక స్థూపం

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 18 వనపర్తి : వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో ఆదివారం అమర జీవి కామ్రేడ్ ఈశ్వర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ పి.మధు అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభ జరిగింది. ఈ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు మాట్లాడుతూ వనగంటి ఈశ్వర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతు కార్మికుల కోసం కూలీల కోసం కష్టజీవుల రాజ్య స్థాపన కోసం చివరిదాకా కష్టపడి పని చేశారని కరువులో అంబలి కేంద్రాలు నిర్వహించారని అనేక ప్రజా ఉద్యమాలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేశారని అన్నారు.

ఈశ్వర్ చేసిన సేవలు మరువలేనివని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యమ నిర్మాత అని కొనియాడారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని మాటలు వెనక్కి పోయింది పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని నేడు చైనా ఇతర సోషలిస్టు దేశాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని అందరికీ విద్య వైద్యం ఉద్యోగం అందరికీ పరిస్థితులు సోషలిజం కల్పించిందని తెలిపారు.

ఈ రాజ్య స్థాపన కోసం కామ్రేడ్ ఈశ్వర్ కష్టపడి పని చేశారని మరియు ఆశీర్వాదం అనేక ప్రజా ఉద్యమాలు చేశారని కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం కడదాకా పని చేయడమే అమరవీరులకు నిజమైన నివాళి అని తెలిపారు.

Martyrs moment

అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకట్, జాన్, వెస్లీ, కిల్లి, గోపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి ఏ రాములు, నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి పర్వతాలు, గద్వాల జిల్లా కార్యదర్శి వెంకట స్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి రాములు, అరుణ్ కుమార్, రామ్ రెడ్డి, అబ్దుల్లా, ఖాన్ ,నాగేశ్వర్ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ, కుర్మయ్య, రమేష్ ,పరమేశ్వర, చారి, ఆంజనేయులు, బాల్రెడ్డి, గోపి, రాజు, వేణుగోపాల్, దేవేందర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

A memorial to the martyrs was inaugurated at Ambedkar Chowk in Vanaparthi town on Sunday.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube