లైన్మెన్ పోస్టుల పరీక్షలో గోల్మాల్
– సెల్ ఫోన్లు తో కేంద్రాల్లో కి
– కేసు నమోదు చేసిన పోలీసులు
టి మీడియా,జూలై22,హైద్రాబాద్ : తెలంగాణ లైన్మెన్ పోస్టుల అర్హత పరీక్షలో గోల్మాల్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షా కేంద్రంలోని సెల్ఫోన్లతో వచ్చి మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. నవ్య అనే యువతి తమ ఫోన్లకు సమాధానాలు పంపినట్లు అభ్యర్థులు వాపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఘట్కేసర్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నవ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, గత ఆదివారం వెయ్యి లైన్మెన్ పోస్టులకు పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
Also Read : ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్ఐ
టీఎస్ఎస్పీడీసీఎల్లో 1000 లైన్మెన్ ఉద్యోగాలకు ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరిగింది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాస్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం అభ్యర్థులను కలవరపెడుతోంది. ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన అభ్యర్థులు మాస్ కాపీయింగ్ గురించి తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైతే ఈ వ్యవహారంపై పోలీసుల నుంచి గానీ విద్యుత్ శాఖ నుంచి గానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పోలీసుల దర్యాప్తులో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube