ప్రజా అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్

-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

2
TMedia (Telugu News) :

ప్రజా అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్

-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
టి మీడియా,జులై2,ఖమ్మం సిటీబ్యూరో:
ప్రజలు,ప్రజా ప్రతినిధులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో సుడా పరిధిలోని ప్రజా అవసరాలకనుగుణంగా సుడా మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,నగర మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు.స్థంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఖమ్మంచే సిద్ధం చేసిన సుడా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్పే శుక్రవారం ఉదయం భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన 2 వ స్టేక్ హోల్డర్స్ సమావేశంలో నగర ప్రజలు,సుడా పరిధిలోని ప్రజాప్రతినిధులు,జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొని సుడా మాస్టర్ ప్లాన్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Also Read : మధిర మండలంలో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ: భవిష్యత్తు అవసరాలకనుగుణంగా సుడా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్న ప్రముఖ కన్సల్టెన్సీ స్టేమ్ వారి ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగిందని, రాబోయో 30 సంవత్సరాల వరకు ప్రజా అవసరాల ప్రాముఖ్యతను పరిగణలోనికి తీసుకొని సిద్ధం చేసిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై ప్రజలు ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించి,వారి అభిప్రాయాలు, సలహాలు,సూచనలను స్వీకరించేందుకు స్టేక్ హోల్డర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

భవిష్యత్తు ప్రణాళికలో రాబోయో 30 సంవత్సరాల కాలంలో పెరిగే జనసాంధ్రత అవసరాలకనుగుణంగా,త్రాగునీటి సరఫరా,విధ్యుచ్చక్తి,పారిశుధ్యం, రోడ్ల విస్తరణ,రెసిడెన్షియల్, కమర్షియల్,బఫర్ జోన్లు,విద్య, వైద్యం,ట్రాఫిక్ నియంత్రణ, నీటి వనరులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసామని,దీనిపై తమ అభిప్రాయాలను,సలహాలు, సూచనలను అందించాలని కలెక్టర్ కోరారు.

 

Also Read : సేవకు చిరునామా ఎంపీ నామ

సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మాట్లాడుతూ :- రాబోయో 40 సంవత్సరాల కాలం వరకు ప్రజా అసవరాలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉందేవిధంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ స్టెమ్ కన్సెల్టెన్సీ ద్వారా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామని,అట్టి డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్‌పై స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, అందరి అభిప్రాయాల మేరకు సుడా మాస్టరైన్పై డి.టి.సి.పి హైద్రాబాద్ వారికి ప్రాతిపాదనలు సమర్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.సుడా పరిధి 7 లక్షల 56 వేల జనాభా,568 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉందని ఖమ్మం నగర పాలక సంస్థ, వైరా మున్సిపాలిటీతో పాటు 39 గ్రామపంచాయితీలు సుడా పరిధిలో ఉన్నాయని, తదనుగుణంగా భవిష్యత్తులో ప్రజల కనీస అవసరాలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండే విధంగా సుడా మాస్టర్ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.

నగర మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణు వారియర్ మాట్లాడుతూ : అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రజా అవసరాలకనుగుణంగా సుడా మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తామని తెలిపారు..
నగరపాలక సంస్థ కమీషనర్ సుడా వైస్ చైర్మన్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ:- రాబోయో 40 సంవత్సరాల వరకు సుడా పరిధిలోని ప్రజల అవసరాలు, కనీస వసతుల కల్పనకు గాను సిద్ధం చేసిన సుడా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రజా అభిప్రాయ సేకరణకు గాను స్టేక్ హోల్డర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

– స్టెమ్ కన్సెల్టెన్సీ ప్రతినిధి శ్రీకుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ న్ను వివరించారు.

ఈ కార్యక్రమంలో డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా,డి.టి.సి.పి జాయింట్ డైరెక్టర్ విద్యాధర్ అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి,జిల్లా పంచాయితీ అధికారి వి.అప్పారావు,ఎం.పి.టి.సిలు, ఎం.పి.పి.లు,సర్పంచ్‌లు,సుడా డైరెక్టర్లు,కార్పోరేటర్లు,జిల్లా, మండల స్థాయి అధికారులు,నగర ప్రజలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube