జాతీయ గణిత దినోత్సవ వేడుకలు…

0
TMedia (Telugu News) :

టీ మీడియా , డిసెంబర్ 22,జన్నారం.

జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బుధవారం రోజున శ్రీ శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ కస్తూరి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు రామానుజన్ ను స్ఫూర్తిగా తీసుకొని నిత్యజీవితంలో గణితం పట్ల శ్రద్ద వహించి భవిష్యత్తులో ఉన్నత విద్యకు మంచి పునాది వేసుకుని దేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తలు తయారు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కృష్ణవేణి, సుధారాణి, శిరీష, లావణ్య, పూజ, గణేష్, నాగేష్ ,మేఘన, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

National mathematics day celebrations
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube