ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

0
TMedia (Telugu News) :

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

– ఘనంగా విద్యా దినోత్సవం

టీ మీడియా, నవంబర్ 11, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యా దార్శనికుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్, మండ్ల దేవన్న నాయుడు మాట్లాడుతూ.. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఖిలాఫత్ ఉద్యమ నాయకుడు, సహాయ నిరాకరణోద్యమం ,ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న పోరాట యోధుడు భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా దార్శనికుడు అన్నారు. దేశ స్వాతంత్రం కోసం జైలుకెళ్లిన నాయకుడు మహాత్మాగాంధీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో కలిసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని నిమ్నకులాల హక్కులకోసం రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటంలో ఆజాద్ పాల్గొన్నాడు. భారతదేశం మొదటి విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన జ్ఞాన మనిషి, ఆయన బహుభాషా కోవిదుడు భారత ప్లాటో మౌలానా , ఇత నీ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ ముస్లిం దినోత్సవంగా జరుపుకుంటారు అని అన్నారు. భారత ప్రభుత్వం అతనికి భారతరత్న బిరుదుతో ఘనంగా సత్కరించింది .

Also Read : జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు

దేశ ప్రజలందరూ విద్యావంతులైన అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని కొనియాడిన జ్ఞాననేత్రం ఆజాద్ భారతీయ విద్య వికాసాన్ని స్వల్ప కాలంలో పురోగమనం వైపు నడిపించిన విద్యామంత్రి ఆయన. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్, రీసెర్చ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ బ్యూరో, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండల వంటి అనేక విద్యా సంస్థను ప్రారంభించారు. హిందీని జాతీయ భాషగా ప్రకటించడానికి ఏకాభిప్రాయం తీసుకు వచ్చారు. వ్యాయామ విద్యను క్షేత్రస్థాయి జ్ఞానం కోసం విజ్ఞాన విహార యాత్రలు ప్రత్యేక పాఠశాలను సామాజిక సేవా దృక్పథంతో విద్యా సంస్థను ప్రారంభించిన విద్యా విప్లవం .ఆయన మానసిక శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలను ఇంకా అనేక సామాజిక సేవా దృక్పథంతో విద్యా సంస్థలను స్థాపించి దిశాలి అతడు కాబట్టి అందరూ చదవాలి అందరూ ఎదగాలి అని ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు రాజా రాం ప్రకాష్ కోరారు.

Also Read : కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

ఈ కార్యక్రమంలో తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు,కావలి బాలస్వామి నాయుడు,వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు,గంధం నాగరాజు జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు,ఇటిక్యాల బండలయ్య ,వనపర్తి జిల్లా రజక సంఘంఅధ్యక్షుడు, బలేమియా మైనార్టీ జిల్లా నాయకుడు,పానుగంటి ఏసు దళిత సంఘ నాయకుడు, కరాటే మాస్టర్ మురళి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube