మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ

అగ్రనేత భార్య లొంగుబాటు

1
TMedia (Telugu News) :

మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ

– అగ్రనేత భార్య లొంగుబాటు

టీ మీడియా,సెప్టెంబర్ 21,హైద్రాబాద్:మావోయిస్టు పార్టీకి పూర్తి గడ్డుకాలంలా కనిపిస్తుంది. తెలంగాణలో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న మావోయిస్టు మూలాలను తుడిచిపెట్టేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఏవోబీలో 700 మంది సానభూతిపరులు లొంగిపోగా.. తాజాగా తెలంగాణలో మావోయిస్టు అగ్రనేత భార్య లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి లొంగిపోయారు. ఆమెను హైద్రాబాద్ తరలించి నట్లు సమాచారం.మావోయిస్టు కీలక నేత రామన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణానంతరం భార్య సావిత్రి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

Also Read : ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

ఈ క్రమంలోనే పోలీసులకు తాను లొంగిపోతున్నట్లు ఆమె సమాచారం ఇచ్చారు. పోలీసులకు సావిత్రి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీని మళ్లీ తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్న సమయంలో సావిత్రి లొంగిపోవడం పెద్ద దెబ్బనే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర సరిహద్దుల నుంచి తెలంగాణ ప్రాంతంలోకి ప్రమాదకరమైన రెండు దళాలు ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. మోస్ట్ వాంటెండ్ అడెల్లు దళంతో పాటు మరో దళం సభ్యులు ఆదిలాబాద్ అడవుల్లో ప్రవేశించాయన్న సమాచారంతో పోలీసులు విస్తృత తనిఖీలు కూడా నిర్వహించారు. అయితే, అడుగడుగునా మావోయిస్టు పార్టీని పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ జరగనుందన్న సమాచారంతో సానుభూతిపరులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube