ఘనంగా మాయవతి పుట్టినరోజు వేడుకలు

ఘనంగా మాయవతి పుట్టినరోజు వేడుకలు

0
TMedia (Telugu News) :

ఘనంగా మాయవతి పుట్టినరోజు వేడుకలు

టీ మీడియా, జనవరి 16, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉక్కు మహిళ బెహెన్జీ కుమారి మాయావతి 67 వ జన్మదిన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు . బిఎస్పి జిల్లా అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ఎన్నికయ్యి లక్షలాది ఎకరాల భూమిని నిరుపేద రైతులకు పంపిణీ చేశారు.పాఠశాలలు, కళాశాలలు,యూనివర్సిటీలు కట్టించి విద్యాభివృద్దికి కృషిచేశారు.మహిళలపై అత్యాచారాలు,హత్యలు, దళితులపై, వెనుకబడిన వర్గాలపై దాడులు ,దౌర్జన్యాలు చేసిన గూండాలపై ఉక్కుపాదం మోపి శాంతిభద్రతలు కాపాడిన పాలనా దక్షత కల్గిన ముఖ్యమంత్రి అని పొగిడారు. బహుజనుల ఆశాజ్యోతి కుమారి మాయావతి పరిపాలన దేశవ్యాప్తంగా అందాలని బహుజనులు తమ భావి భారత ప్రధాని కావాలని మహనీయులు పూలే అంబేద్కరుల ఆశయాలు నెరవేర్చి మాన్యవార్ కాన్షీరాం కలలుగన్న బహుజన రాజ్య స్థాపన జరగాలని చెన్నరాములు అన్నారు. అనంతరం వనపర్తి జిల్లా ఆసుపత్రిలో బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె మహేశ్ ఆధ్వర్యంలో కుమారి మాయవతి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ హాజరై రక్తదాతలకు పండ్లరసం అందించారు.

Also Read : పేదలకు దుప్పట్లు పంపిణీ

ఆసుపత్రి సిబ్బంది వహీద్ బిఎస్పి రేవల్లి మండల అధ్యక్షులు బంకల అజయ్, పృథ్వీ ,శివ,శ్రీను లకు సర్టిఫికెట్లను ఇచ్చారు . ఈ కార్యక్రమంలో గోపాల్ పేట మండల అధ్యక్షులు వంశీకృష్ణ , ప్రధానకార్యదర్శి మండ్ల మైబూస్ వాల్మీకి,కాటిక కుర్మయ్య , బి.వి.ఎఫ్ వనపర్తి అసెంబ్లీ కన్వీనర్ ,కో కన్వీనర్లు మధు, సుభాష్ చంద్ర ముదిరాజ్, సోషల్ మీడియా కన్వీనర్ అంజి పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube