కార్గోలో ముత్యాల తలంబ్రాలు బుక్‌ చేసుకున్న టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్‌

కార్గోలో ముత్యాల తలంబ్రాలు బుక్‌ చేసుకున్న టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్‌

1
TMedia (Telugu News) :

కార్గోలో ముత్యాల తలంబ్రాలు బుక్‌ చేసుకున్న టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్‌

టీ మీడియా ,మార్చి 30,హైద‌రాబాద్‌: భద్రాచలం రాములవారి కల్యాణ ముత్యాల తలంబ్రాలను ఆర్టీసీ కార్గోద్వారా టీఎస్సార్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ బుక్ చేసుకున్నారు. ఈ మేర‌కు మంగళవారం బస్‌భవన్‌లో కార్గో సర్వీస్‌ సిబ్బందికి రూ.80 చెల్లించి రశీదు పొందారు. ఆర్టీసీ భక్తుల ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు చేరవేయనున్నదని, భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సజ్జనార్‌ సూచించారు.రాములవారి కల్యాణ తలబ్రాలను టీఎస్‌ఆర్టీసీ కార్గో,పార్సిల్‌ కౌంటర్లలో కేవలం రూ.80 చెల్లించడం ద్వారా పొందవచ్చని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సహకారంతో ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ సేవలు పొందాలనుకునే వారు వివరాలకు టీఎస్‌ ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-30102829, 68153333 సంప్రదించాలని సూచించారు. సమీప కార్గో , పార్శల్‌ కౌంటర్లలో సంప్రదించవచ్చని స‌జ్జ‌నార్ తెలిపారు.

Also Read : నో రెస్ట్ అంటోన్న ఎన్టీఆర్‌..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube