జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు
టీ మీడియా, నవంబర్ 11, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో స్వేచ్చాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా అందరు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యేంద్ర సింగ్ (సత్తుపల్లి నియోజకవర్గం), తుషార్ కాంత మహంతి (ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు), కానా రామ్ (మధిర, వైరా నియోజకవర్గాలు) లు తెలిపారు. శనివారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాధారణ పరిశీలకులు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో జిల్లా ఎన్నికల పనులపై సమీక్షించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, జిల్లాలోని ఎన్నికల నియావళి ఉల్లoఘన జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని, గతంలో జరిగిన అసెంబ్లి, పార్లమెంట్ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఎన్నికల విధులను విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు.
Also Read : కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం
పోలింగ్ పర్సంటేజిని పెంచేలా చూసుకోవాలని, నేటి నుండి ఎన్నికల పనులు ముగిసే వరకు చేపట్టాల్సిన పనులు, అంశాలపై సమీక్షించుకోవాలని, అవసరమైన చోట అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకు ఖాతాల ద్వారా ఎక్కువ మొత్తం లేదా ఎక్కవ సార్లు జరిపిన లావాదేవీలపై దృష్టి సారించి ప్రతిరోజు నివేదికలను అందజేయాలని అన్నారు. వైన్ షాపులపై నిఘాఉంచి మద్యం అమ్మకాలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల నిబంధనల ఉలంఘన జరగకుండా ఎఫ్ఎస్టి, విఎస్ఎస్టి బృందాల నిఘా పెంచాలని, వంద శాతం పోలింగ్ జరిగేలా చూడాలని అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల చర్యలపై పరిశీలకులకు వివరించారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్ల నమోదు కొరకు నియోజక వర్గం వారిగా ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, వికలాంగులు, సీనియర్ సిటిజెన్ల కొరకు ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని, హోమ్ ఓటింగ్ లో భాగంగా బిఎల్ఓ ల ద్వారా ఫామ్-12డిలను అందించడం జరిగిందని, ఇందుకు నియోజక వర్గం వారిగా నోడల్ అధికారులను కూడా నియమించడం జరిగిందని తెలిపారు. నూతంగా ఓటరుగా నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డులను పోస్టు ద్వారా ఓటరుకు చేర్చడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 390 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేసుకొని ఆయా నియోజక వర్గాల ఆర్.ఓ. లకు ఈవియం, వివిపాట్, సియులను అందించడం జరిగిందని తెలిపారు.
Also Read : ప్రజలకు నామ దీపావళి శుభాకాంక్షలు
జిల్లాలో వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా అనుమతుల జారీలో ఆలస్యం జరగకుండా చూడడంతో పాటు ఉల్లంఘనలపై కూడా త్వరితగతంగా చర్యలు తీసుకోవడం జరుగుతందని తెలిపారు. నోడల్ అధికారులు ఇప్పటివరకు చేపట్టిన పనులు పురోగతి గురించి పరిశీలకులు నివేదిక సమర్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube