మంత్రిని కలిసిన నాయకులు
టీ మీడియా, మార్చి 02, జగిత్యాల :
జగిత్యాల జిల్లాలోని,పట్టణ కేంద్రంలో, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా, నూతనంగా ఎన్నికైన, అధ్యక్షులు కమటాల శ్రీనివాస్,
మరియు వారి పాలక వర్గ సభ్యులు, బుధవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో, సంక్షేమ శాఖ మంత్రి, కోప్పుల ఈశ్వర్ ను, మర్యాద పూర్వకంగా, కలవడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి వారిని, శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్, అధ్యక్షులతో పాటు,
ప్రధాన కార్యదర్శి, పెద్ది శ్రీనివాస్, కోశాధికారి కప్పల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు గుడికందుల మహేష్, సహాయ కార్యదర్శి బోయినపల్లి ప్రశాంత్ రావు, తదితరులు పాలుగోన్నట్టు, మంత్రి కార్యాలయ సిబ్బంది, మీడియాకు తెలిపారు.