మేడారం మినీ జాతర

తల్లులకు మొక్కులు చెల్లించే ఏర్పాట్లలో పల్లే ప్రజలు

0
TMedia (Telugu News) :

మేడారం మినీ జాతర

– తల్లులకు మొక్కులు చెల్లించే ఏర్పాట్లలో పల్లే ప్రజలు

లహరి, జనవరి 31,మేడారం : గుడి లేని దేవతలు, గిరిజనుల ఆరాధ్య దైవాలు, పల్లె ప్రజల ఇలవేల్పులు సమ్మక్క సారలక్కల మొక్కులు చెల్లించుకునేందుకు గ్రామ సీమల్లో సందడి మొదలైంది. చీరలు, సారెలు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు సమర్పించి కోళ్లను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామీణ ప్రజలు సమయాత్తమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమ్మక్క- సారలక్కల పూనకాలతో భక్తుల సందడి మొదలవనున్నది. బుధ, గురువారాలలో మొక్కులు తీర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేడారం మినీ జాతర ప్రారంభం కానున్నది. సమ్మక్క – సారలమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రానున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నది.

Also Read : నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ మహా జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. అదే రోజుల్లో మినీ మేడారం జాతర నిర్వహిస్తారు. మండ మెలిగే కార్యక్రమంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. జాతరకు సుమారు ఐదు లక్షల మంది భక్తులు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనులు ప్రైవేట్ వాహనాలలో జాతరకు భారీ సంఖ్యలో తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube