మీడియాకు కబేళా ముడుపులు ..!

ఫుడ్ ఎక్స్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గాపేర్కొం....

2
TMedia (Telugu News) :

మీడియాకు అల్-సమీ కబేళా ముడుపులు ..!* ఏటేటా 300 మందికి నజరానాలు
* కొందరికి నోట్ల పే… మరికొందరికి ఆన్ లైన్ పే…
* వజ్రకూటంమేనేజరే పాత్రధారి

PHONE PAY
PHONE PAY
PHANI
PHANI

శంఖవరం:

అదొక పశువధ్యశాల. సాధారణ ప్రజలకు తెలిసిన పేరు వజ్రకూటం అల్ -సమీ పశుకబేళా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ భూ దస్త్రాలు మాత్రం దాని పేరును అల్ సామీ ఫుడ్ ఎక్స్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేర్కొంటాయి. ఆ సంస్థ తను, తన చిరునామా గురించి … అల్-సమీ ఆగ్రో ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీఫ్ మీట్ ఎక్స్పోర్ట్స్, మొదటి అంతస్తు, ప్లాట్ సంఖ్యలు ఈ -16, 17,18, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ధవళేశ్వరం, రాజమండ్రి అని చెప్పుకుంటుంది. ఈ సంస్థ తనకు రెండు పశు వధ్యశాలల కర్మాగారాలు ఉన్నాయనీ, 1,200 మందికి పైగా ఉద్యోగులతో రోజుకు 2,500 పైగా టన్నుల పశు మాంసం ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచ వ్యాప్తంగా 110 పైగా దేశాల్లో కొనుగోలుదార్లతో భారత దేశం కేంద్రంగా తులతూగుతున్న అల్-సమీ పశువధ్యశాల (కబేళా) గా ఈ బాహ్య ప్రపంచం ముందు బహిరంగంగా తన గురించి తాను ఆవిష్కరించు కుంటుంది. తనకున్నట్టు చెప్పుకుంటున్న ఈ రెండు పశు వధ్యశాలలు మాత్రం ఈ ప్రపంచంలో ఏ యే చిరునామాల్లో ఉన్నాయో అన్నది మాత్రం బహిర్గతం చేయదు. అయినప్పటికీ ఈ రెండింటిలో ఒకటి మాత్రం … తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకూటం పంచాయతీ శివారు రామన్నపాలెం (నదార్తు) గ్రామంలో వ్యవసాయ పొలాల్లో ఉన్నది. ఇది ప్రభుత్వ రెవెన్యూ దస్త్రాల్లో 302 ఖాతా నెంబరులో 109 సర్వే నెంబరులో మూడు ముక్కలుగా వరుసగా 3.7 ఎకరాలు, 4.3 ఎకరాలు, 5 ఎకరాలు చొప్పున మొత్తం 13 ఎకరాల వ్యవసాయ సాగు భూమిలో విస్తరించి ఉన్నట్టు రెవెన్యూ శాఖ పేర్కొంటున్నది. ఈ భూమిని అల్-సమీ సంస్థ 17 నవంబర్ 2016 లో కొనుగోలు చేసింది. అల్-సమీ 28 అక్టోబర్ 2009న స్థాపితమై, ప్రభుత్వేతర కంపెనీగా వర్గీకృతమై, విజయవాడలోని భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో నమోదైన ఒక ప్రైవేట్ సంస్థ. దీని కార్పొరేట్ గుర్తింపు సంఖ్య యు15400ఎపి2009పిటిసి065642. దీని రిజిస్ట్రేషన్ సంఖ్య 65642. సంస్థ అధీకృత మూలధనం
రూ. 80,000,000 కాగా చెల్లింపుల మూలధనం రూ. 73,848,648. ఈ సంస్థకు డైరెక్టర్లుగా షేక్ సాద్, అజీమ్ ఉన్నిసా బేగం, హజీ-అబ్దుల్ సలామ్, మహ్మద్ అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు. వీరిలో హజీ-అబ్దుల్ సలామ్ ఫౌండర్, ఛైర్మన్, మేంజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈయనకు ఈ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా విస్తృతమైన అనుభవం ఉంది. భారతదేశంలోని అల్-సమీకి ఈయనే మార్గదర్శకుడు. ఈయన ఈ వ్యాపార కార్యకలాపాలను నిత్యం శ్రద్ధతో క్రమబద్ధీకరించి, అభివృద్ధి చేస్తారు.

ఇది కూడా చదవండి :పేకాట, జూదం తో చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు..!

ఈ సంస్థ తన గురించి… 2009లో ప్రారంభ మైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయమైన కొనుగోలుదారుల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ అపారంగా అభివృద్ధి చెందిందని, తమ పశు మాంస ఉత్పత్తి రుచి, నాణ్యత, పరిశుభ్రత, విశ్వసనీయతకు మారుపేరని, భారత ప్రభుత్వ వ్యవసాయ శుద్ధీకరణ ఆహార ఉత్పత్తి ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ మంత్రిత్వశాఖ (అగ్రికల్చరల్ ప్రోసెస్డు ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ – అపెడా) అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్ అబాటోయిర్ కమ్ మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ గానూ, తమ పశువధ్యశాల చుట్టూ జంతువుల అభివృద్ధికి అనువైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే పచ్చదనం, అడవులు, కొండలు, చిన్న ప్రవాహాలు ఉన్నాయని, సమగ్ర నాణ్యత, పరిశుభ్రమైన వధ హామీకి కట్టుబడి ఉంటామని, అలాగే జమియాత్ ఉలేమా-ఇ-హింద్ పర్యవేక్షణలో ఇస్లామిక్ చట్టం ప్రకారం ‘హలాల్’ స్లాటరింగ్ విధానం కలిగి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పశువైద్య ఆరోగ్యశాఖ ద్వారా ధృవీకృత మైందని, మాంసం ఉత్పత్తులను ప్రతి స్థాయిలో కఠినమైన నాణ్యత, తనిఖీలను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నదని, ఇది తమ సంస్థ విధానమని, ఉత్పత్తుల కొనుగోలు దారులకు, బాహ్య ప్రపంచానికి ఘనంగా చెప్పుకుంటోంది.

ఇది కూడా చదవండి :అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం

ఐతే బాహ్య ప్రపంచానికి ఈ సంస్థ చెప్పని అంతర్గత విధానం మరొకటి ఉంది. ఈ సంస్థ ప్రతీ ఏటా క్రమం తప్పకుండా జనవరి మాసం సంక్రాంతి సందర్భంగా మీడియా సిబ్బందికి, ఇతర వ్యక్తులకు ముడుపుల పుస్తె కడతున్నది. ఈ లంచాల తంతును అంతా వజ్రకూటం కబేళా జనరల్ మేనేజర్ స్వయంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ వ్యవహారాన్ని 2020 వరకూ కరీం నిర్వహిస్తే…. ఆయన స్థానంలో వచ్చిన ధర్మవరపు పవన్ కుమార్ 2021 సంవత్సరం నుంచి చక్కబెడు తున్నారు. వజ్రకూటం కబేళా చుట్టూ ఉన్న ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, తుని నియోజకవర్గల్లోని సుమారు 300 మంది విలేకరులకు ముడుపులను ముట్టజెపుతారు. అందులోనూ చిన్న, పెద్ద దిన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అనే మూడు విభజనలు చేసి ఒక్కో విభజనకు ఒక్కో లెక్కన సొమ్ము లను కొంత మంది విలేకరులకు నేరుగా నగదు రూపంలోను, మరికొందరికి ఫోన్ పే, గూగుల్ పే తదితర విధానాల్లో ముడుపులను చెల్లిస్తున్నారు. ఈ ముడుపుల జాబితాను మాత్రం శంఖవరం మండలం కత్తిపూడిలోని ఓ విలేకరి ఇంట్లో వండి వార్చుతారు. సదరు విలేకరి కుటుంబానికి రంపపు మిల్లు ఉండటం, దాని నుంచి కబేళాకు వంట చెరకు సరఫరా ఒప్పందాల సత్సంబంధాలు ఉండటంతో ఈ ఏడాది జనవరిలో కూడా ఆ విలేకరి ఇంట్లోనే ముడుపుల జాబితాను పవన్ కుమార్ తయారు చేయించారు. సదరు విలేకరి ఎంత చెపితే అంతే ఈ జాబితాలో నగదు నమోదు, ఆపై చెల్లింపులు జరుగుతాయి. మా సంస్థ అంతని, ఇంతనీ చెప్పునే ఈ సంస్థ మీడియాకు, ఇతర వ్యక్తులకూ ఏటేటా ఎందుకు లంచాలను ఇస్తోందనేది బహిరంగ రహస్యమే. ఈ లంచాల చెల్లింపుల సూత్రధారి యాజమాన్యం ఐతే పాత్లధారి మాత్రం కబేళా జనరల్ మేనేజర్. ఆ సంస్థ అవినీతి, అక్రమాలను మీడియాలో బహిర్గతం చేయకుండా ఉండడానికే మీడియా ముందు కాళ్ళకు లంచాల బంధాలను వేస్తోంది అల్-సమీ పశువధ్యశాల అనేబడే కబేళా. అందుకే మీడియా కూడా తన నోటికి ఏటేటా వేసుకుంటోంది తాళం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube