మీడియానే ప్రచారం చేస్తోంది.

బీజేపీలో చేరికపై పొంగులేటి

0
TMedia (Telugu News) :

మీడియానే ప్రచారం చేస్తోంది..

-బీజేపీలో చేరికపై పొంగులేటి

– ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలోకి దిగుతా

టీ మీడియా, జనవరి 10,అన్నపురెడ్డిపల్లి : బీజేపీలో చేరుతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా బీజేపీలో చేరికపై స్పందించారు. తాను బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరాల్సి వస్తే.. దొంగచాటుగా అమెరికాలోనే లేదా ఢిల్లీలోనే కండువా కప్పుకోనని, ఢిల్లీ నడిబొడ్డున 2.50 లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకుంటానంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ను వీడాల్సి వస్తే బహిరంగంగా ప్రకటిస్తానన్నారు.ఆలూ లేదు చూలు లేదు… కొడుకు పేరు సోమలింగం అన్న తరహాలో తాను బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని పొంగులేటి సెటైర్ వేశారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని, తనను నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలోకి దిగుతానని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సిందే

తన వెంట ఉన్న నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దిగుతారని చెప్పారు. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం పొంగులేటి వెల్లడించడం లేదు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పటినుంచో బీఆర్ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు ఆయనకు కాకుండా నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ కేటాయించింది. ఆ తర్వాత పొంగులేటికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన అభిమానులు ఆశించారు. కానీ కేసీఆర్ ఆయనకు ఎలాంటి నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంతో.. కొంతకాలంగా బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్నారు. దీంతో తమ పార్టీలో చేరాల్సిందిగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆయనను ఎప్పటినుంచో ఆహ్వానిస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకోవాలనే ఆలోననలో పొంగులేటి ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. గత కొంతకాలంగా పొంగులేటి బీఆర్ఎస్‌పై బహిరంగంగా విమర్శలు కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం కోసమే బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయనకు ప్రభుత్వం భద్రతను తగ్గించడం ఖమ్మం జిల్లా పాటిలిక్స్‌లో కలకలం రేపింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube