ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

1
TMedia (Telugu News) :

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

టి మీడియా, నవంబర్ 3, జన్నారం : ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జన్నారం మండల జెడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్ అన్నారు.హ్యాండ్‌ ఆఫ్‌ హౌప్‌ సౌజన్యంతో రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గురువారం రోజున మండల కేంద్రంలోని జయరాని పాఠశాల యందు ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జెడ్పిటిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలపై డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో మేలు కలిగిస్తాయన్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

Also Read : వైఎస్ షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలి

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ రియాజుద్దీన్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, సర్పంచులు జక్కు భూమేష్, గంగాధర్ గౌడ్, ఉప సర్పంచ్ జంగం రవి, ఇట్టి క్యాంపు నిర్వహకులు సుధారాణి, ఆనంద్ రాజ్, కుమార్ డేవిడ్, నిర్వాహకులు పురుషోత్తం, సాలెం ఇజ్రాయిల్, ప్రకాష్ డానియల్ ,ప్రేమానంద్, మంద రాజేష్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube