కేజీబివి లో మెడికల్ క్యాంపు ఏర్పాటు

కేజీబివి లో మెడికల్ క్యాంపు ఏర్పాటు

1
TMedia (Telugu News) :

కేజీబివి లో మెడికల్ క్యాంపు ఏర్పాటు

టి మీడియా, జూలై 27 ,చిన్నంబావి:

చిన్నంబావి మండల కేంద్రం లోని కేజిబివి పాఠశాల లోని విద్యార్థులు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని జడ్పిటిసి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి గారు డాక్టర్ వంశీకృష్ణ సూచించారు.ప్రస్తుతము అనారోగ్యంగా ఉన్న ప్రత్యేక విద్యార్థినిలను పరిశీలించి దగ్గు జలుబు జ్వరాలు ఉన్నవారిని ట్రీట్మెంట్ చేసి తగిన మోతాదులో మందులు ఇవ్వడం జరిగినది. కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి కేశిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యము పరిశుభ్రత అనే అంశంపై శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రకాల చదువులలో క్రీడలలో రాణించవచ్చని ముఖ్యంగా సిబ్బంది మరియు ఉపాధ్యాయులు విద్యార్థినిలను ఎప్పుడెప్పుడు పర్యవేక్షించి ఏ చిన్న పొరపాటు లేకుండా శ్రద్ధగా ఎవరి పని వాళ్లు చక్కగా చేసుకోవాలని సూచించారు.

 

Also Read : భగ్గుమన్న మల్లంపల్లి..

 

డాక్టర్ వంశీకృష్ణ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి విద్యార్థి శుభ్రతతో ఉండాలి అని ప్రతి అంశంపై విద్యార్థినీలకు చాలా చక్కగా వివరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ తో పాటు వారి సిబ్బంది మరియు ఎంపీడీవో రవి నారాయణ గారు, మండల ప్రత్యేక అధికారి కేజీబీవీ ప్రిన్సిపల్ గారు విద్యార్థులను పరిశీలించి తగిన మందులు ఇచ్చి ఆరోగ్య జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిరోజు ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం గారు 20 రోజుల దాకా పరిశీలించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరడం జరిగినది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube