రైట్ ఛాయిస్ , పే బ్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

రైట్ ఛాయిస్ , పే బ్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

1
TMedia (Telugu News) :

రైట్ ఛాయిస్ , పే బ్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

టి మీడియా, మే 23,ఖమ్మం : నగరంలో ఆదివారం ఎస్.ఎన్.ఆర్ & బి.జీ.ఎన్.ఆర్ గ్రౌండ్లో 675 మంది పోలీస్ ఎస్ ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువతి , యువకులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ లో డాక్టర్లు డా. సుబ్బారావు , డా శ్యామ్ కుమార్ లు షుగర్ , బీపీ , పల్స్ రేట్ , ల0గ్స్ ఇన్ఫెక్షన్స్ , ఆస్తమా మొ.గు , కరోనా వచ్చి తగ్గిన వాళ్ళల్లో ఆక్సిజన్ లెవల్స్ , సామర్ద్యత మొ.గు వాటిని పరీక్షించి , రన్నింగ్ చేసేటప్పుడు వచ్చే సమస్యల్ని ఎలా అధిగమించాలో తెలియజేసారు . ఉపయోగించుకున్న నిరుద్యోగ యువతి , యువతను ఉద్దేశించి రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ ఎం. కిరణ్ కుమార్ , పే బ్యాక్ సొసైటీ స్థాపకులు జంగం. లక్ష్మణ్ రావు , హ్యూమన్ రైట్స్ చైర్మన్ చిలకబత్తిన. కనకయ్య , గ్రౌండ్ ఈవెంట్స్ కోచ్ వి. మోహన్ , త్రినాద్ లు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం సమాజాన్ని, యువతని సక్రమ దిశలో నడిపించి , శాంతి భద్రతలు కాపాడే ఉద్యోగ0 మీరు ఇష్టంతో చదివి , గ్రౌండ్ ప్రాక్టీస్ చేసి , ఉద్యోగాన్ని సంపాదించి , సమాజానికి సేవ చేస్తూ రక్షక బటులుగా నిలవాలి అని తెలియజేసారు.

Also Read : రైతుఆత్మహత్య

ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీమాధవ హాస్పిటల్స్ నుండి డా విమలా సుబ్బారావు , సుజాత హాస్పిటల్స్ నుండి డా శ్యామ్ కుమార్ , ఎం.డి , ఆర్ భరత్ , దుర్గ విరంచి హాస్పిటల్ నుండి డా జి కిరణ్ కుమార్ , శాన్వి హాస్పిటల్ నుండి డా శివకృష్ణ , రాజకుమారి హాస్పిటల్ నుండి డా. స్వర్ణకుమారి లతో పాటు వారి హాస్పిటల్ సిబ్బంది మరియు హెచ్ ఆర్ సి రాష్ట్ర సెక్రెటరీ రొడ్డ శివయ్య , అకాడమీ ఎం డి అరుణ సభ్యులు ఆచ్చుత్ రావు , రమేష్ , శివ , భాస్కర్ , అరవింద్ , కనకరాజు , వెంకన్న , అప్పారావు , రాజు , నాగభూషణం , నాగరాజ్ , సాయి కిరణ్ , సత్యనారాయణ మొ.గు వారు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube