మెడికల్ ఉద్యోగుల హక్కుల రక్షణకై పోరాడుదాం

మే డే పోస్టర్ ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

మెడికల్ ఉద్యోగుల హక్కుల రక్షణకై పోరాడుదాం

మే డే పోస్టర్ ఆవిష్కరణ

టీ మీడియా,ఏప్రిల్ 27, గోదావరిఖని :

136వ మేడే కార్యక్రమాల విజయవంతం కొరకై గోదావరిఖని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆవరణలో బుధవారం ఏఐటీయూసీ మేడే వాల్ పోస్టర్స్ ని ఏ ఐ టి యు సి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ ఆవిష్కరించి మాట్లాడుతూ…మెడికల్ ఉద్యోగుల హక్కుల రక్షణకై ఉద్యోగ భద్రత కై పోరాడాలని పిలుపునిచ్చారు మెడికల్ ఉద్యోగులకు ప్రమోషన్ పాలసీలో అవకతవకలు జరుగుతున్నాయని గోదావరిఖనిలో మెడికల్ కాలేజ్ నిర్మాణం అవుతున్న దృశ్య మెడికల్ ఉద్యోగుల విధులు మెడికల్ కాలేజీలో నిర్వహించాలా వైద్య విధాన ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించాలా కన్ఫ్యూజన్లో మెడికల్ ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఉన్నత అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులకు విజ్ఞప్తి చేశారు పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Also Read : నేడే SBIT సావిష్కర్-22

చికాగో అమరవీరుల రక్తంలో ముంచెత్తిన జెండా ఎర్ర జెండా ని కార్మికులకు ఉద్యోగులకు కష్టజీవులకు ప్రపంచ శ్రామిక జనావళికి ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్మికుల ఉద్యోగుల పండగ మే డే అని అన్నారు.జెండా ఆవిష్కరణ లు సభలు సమావేశాలు విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ నెంబర్ శనిగల శ్రీనివాస్ అన్వర్ నర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ గోదావరిఖని బ్రాంచ్ సెక్రెటరీ ఆర్జీవీ లక్ష్మి హెడ్ నర్స్ పద్మ,స్టాఫ్ నర్స్ భవాని,శైలజ,మమత, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube