మెడికల్ సీట్ సాధించిన స్టాఫ్ కెమెరామెన్ కూతురు

అభినందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్

1
TMedia (Telugu News) :

మెడికల్ సీట్ సాధించిన స్టాఫ్ కెమెరామెన్ కూతురు

 

– అభినందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్

టీ మీడియా, నవంబర్ 8, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా సీనియర్ స్టాఫ్ కెమెరా మెన్ కన్నూరి సారయ్య కూతురు కుమారి ఖ్యాతి కరీంనగర్ ప్రతిమ మేడికల్ కళాశాల లో మెడికల్ సీట్ సాధించింది.సారయ్య మంచిర్యాల జిల్లా,చెన్నూరు నియోజకవర్గం,రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ లో ఉంటున్నాడు.కుమారి ఖ్యాతి స్థానిక సెయింట్ జాన్స్ హై స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకుంది.హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి మెడికల్ ఎంట్రన్స్ లో మంచి ర్యాంకు సాధించి,కరీం నగర్ ప్రతిమ వైద్య కళాశాల లో సీటు సాధించింది.సీనియర్ స్టాఫ్ కెమెరా మెన్ సారాయ్య కూతురు మెడికల్ సీటు సాధించిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎం.ఎల్.ఏ బాల్క సుమన్ మంగళ వారం హైదరాబాద్ మినిష్టర్స్ క్వార్టర్ చిన్నారి ఖ్యాతి ని అభినందించారు.

 

Also Read : గోవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ పరామర్శ

 

తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. పేదరికాన్ని లెక్క చేయక అమ్మాయి ని వైద్య విద్య అభ్యసించేందుకు ప్రోత్సాహించిన సారయ్య ను బాల్క సుమన్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివే విధంగా ప్రోత్సహించాలని అన్నారు.ఆడ పిల్లలను ప్రోత్సహిస్తే వారు తప్పకుండా మీ ఆశయాలు నెరవేర్చి,మీకు మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తారని అన్నారు.బాలికలు బాగా చదువుకుని,ఉన్నత శిఖరాలకు చేరుకొవాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube