ఉక్రెయిన్ భాదిత వైద్య విద్యార్థికి పరామర్శ

ఉక్రెయిన్ భాదిత వైద్య విద్యార్థికి పరామర్శ

1
TMedia (Telugu News) :

ఉక్రెయిన్ భాదిత వైద్య విద్యార్థికి పరామర్శ

టీ మీడియా,మార్చి 22:,వరంగల్ :జిల్లా నర్సంపేటకు చెందిన నేతకాని దళిత యువకుడు జనగాం ప్రశాంత్ ఉక్రెయిన్ లో వైద్యవిద్యను అభ్యసిస్తు రష్యా – ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని భయాందోళనలతో ఇటీవల స్వస్థలం నర్సంపేటకు చేరుకున్నాడు. అయితే మంగళవారం సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ ,వరంగల్ జిల్లా కమిటీ సభ్యులతో కల్సి వైద్య విద్యార్థి జనగాం ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా వారు వైద్య విద్యార్థి జనగాం ప్రశాంత్ కు స్వీట్లు అందించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువు మధ్యలో మానేయాల్సి వస్తోందని అధైర్య పడవద్దని, ఈ లోపు ఆన్లైన్లో క్లాసులు వింటూ చదువులో నైపుణ్యత పెంచుకోవాలని మానసిక దైర్యం నింపారు.

Also Read : దాడులక పాల్పడుతున్న చిరుత

యుద్ధ వాతావరణం ముగిశాక తదుపరి విద్యాబ్యాసం కోనసాగించేలా కృషి చేయాలని విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉండిపోయిన విద్యార్థులను వారి వారి స్వస్థలాలకు చేర్చాలని కోరిన వెంటనే స్పందించి సురక్షితంగా స్వస్థలానికి చేర్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులను ఉద్దేశించి మన రాష్ట్రంలోనే మనదేశంలోనే తక్కువ ఖర్చుతో వైద్య విద్య ను పూర్తిచేసే విధంగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చందనగిరి ప్రమీల జనగాం లక్ష్మయ్య రామటెంకి నవీన్ , సమత, జాడీ సారయ్య, దుర్గం వెంకటేశ్వర్లు, సల్లూరి సునీల్, జనగాం సంతోష్, విద్యార్థుల తల్లిదండ్రులు రామారావు సాంబలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube