ఎన్సిడి మందుల కిట్ పంపిణీ

ఎన్సిడి మందుల కిట్ పంపిణీ

1
TMedia (Telugu News) :

ఎన్సిడి మందుల కిట్ పంపిణీ

టీ మీడియా, నవంబర్ 2, రామకృష్ణా పూర్ : రామక్షపూర్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డ్ అల్లూరి సీతారామరాజు నగర్, రెండో వార్డు జ్యోతినగర్ జోడి పంపుల ఏరియాలలో వార్డు కౌన్సిలర్ లు పొగుల మల్లయ్య, పుల్లూరి సుధాకర్ ల ఆధ్వర్యంలో బుధవారం దీర్ఘ కాలికి వ్యాధులకు మందులు వాడే ప్రజలకు ఎన్సీ డి మందుల కిట్ లను పంపిణి చేశారు. మందమర్రి దీపక్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ శివప్రసాద్ సిబ్బంది పుష్ప, ఆశ కార్యకర్త వెంకటలక్ష్మి లతో వార్డు ప్రజలకు దీర్ఘకాలిక మందులు వాడే వాళ్లకు ఎన్సిడి కిట్ బ్యాగు మందులు అందజేశారు.

Also Read : ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు

ఈ సందర్భంగా కౌన్సిలర్ లు పొగుల మల్లయ్య,పుల్లూరి సుధాకర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉందాలని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేస్తుందని, దీర్ఘకాలిక రోగాలైన బీపీ, షుగర్ వ్యాధులకు ఉపయోగించే మందులు ఉదయం మధ్యాహ్నం రాత్రి వేసుకునే విధంగా బ్యాగులో మూడు అరలు ఏర్పాటు చేసి కిడ్ బ్యాగ్ లలో అందజేసినట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డ్ టిఆర్ఎస్ నాయకులు రవి,గాజుల శంకర్,వెంకటేష్, కృష్ణ, సతీష్, గణపతి, ఎల్లయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube