విజయవంతంగా జరిగిన మెగా మెడికల్ క్యాంపు

విజయవంతంగా జరిగిన మెగా మెడికల్ క్యాంపు..

0
TMedia (Telugu News) :

 

విజయవంతంగా జరిగిన మెగా మెడికల్ క్యాంపు

గా మెడికల్ క్యాంపుఉచిత వైద్య సేవలు మరింత ఆరోగ్యాన్ని కాపాడతాయి – ప్రముఖ బిజినెస్ మ్యాన్, VVC సంస్థల అధినేత వంకాలపాటి రాజేంద్ర ప్రసాద్ప్రతి నెలా తప్పకుండా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు జిల్లా వ్యాప్తంగా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో వుందని, ఉచిత సేవలకు తమ సంస్థ VVC తరుపున రాబోయే కాలంలో పూర్తి సహకారం అందిస్తామని ప్రముఖ వ్యాపారవేత్త, VVC సంస్థల అధినేత వంకాలపాటి రాజేంద్ర ప్రసాద్ (రాజా) హామీ ఇచ్చారు. శనివారం మంచికంటి భవన్ లో CPM పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ, బోడేపూడి విజ్ఞాన కేంద్రం ( BVK) ఆధ్వర్యంలో బిపి, షుగర్ మెడికల్ క్యాంపు విజయవంతం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ మెడిసిన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడం ఒక ముఖ్యమైన బాధ్యత అని, అనారోగ్యం బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన వుందని పేర్కొన్నారు. మనిషి కి చదువు, ఆరోగ్యం వుండటం ద్వారా మంచి సమాజం ఏర్పడుతుంది అని తెలిపారు. మెడికల్ క్యాంపు లో మరింతగా ఉచిత వైద్య సేవలు కోసం తమ ట్రస్ట్ ద్వారా రానున్న కాలంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హార్ట్ పరిక్షలు, దంత పరిక్షలు, కంటి పరిక్షలు, చెవి ముక్కు గొంతు పరిక్షలు, ధారయైడ్ పరిక్షలు ఉచితంగా నిర్వహించారు. అనంతరం బిపి షుగర్ కు నెలకు సరిపడా మందులు అందించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్, పలు ప్రముఖ డాక్టర్లు పత్తి గణేష్, హర్షా , మురారి, సి భారవి, కొల్లి అనుదీప్, పి సుబ్బారావు , నాయకులు వై శ్రీనివాసరావు, బోడపట్ల సుదర్శన్, శివ నారయణ రామారావు, నర్రా రమేష్, జె వెంకన్న బాబు, అఫ్జల్, వాసిరెడ్డి వీరభద్రం , నాగేశ్వరరావు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube