మంత్రి హరీష్ రావు నుకలిసిన విద్యార్థి జేఏసీ నేత
టీ మీడియా, మార్చి 14, జగిత్యాల : జిల్లా కేంద్రానికి చెందిన, మేకల అక్షయ్ కుమార్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, తన్నీరు హరీష్ రావును, మర్యాద పూర్వకంగా కలిసి, ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ ఏజెన్సీలలో ఎస్సీ లకు, ప్రత్యేక రిజర్వేషన్ల అమలుకు ఆదేశాలు జారీ చేసినందుకు గాను, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, మరియు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, తన్నీరు హరీష్ రావును, మర్యాద పూర్వకంగా కలిసి కృతఙ్ఞతలు తెలియజేసిన, తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మేకల అక్షయ్ కుమార్, తదనంతరం అక్షయ్ కుమార్ మాట్లాడుతూ,
రాష్ట్రం లోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆహార క్యాంటీన్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, భద్రతా సిబ్బంది, నిర్వహణకు సంబంధించిన ఏజెన్సీలలో ఎస్సీ లకు ప్రత్యేకంగా 20 శాతం, రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల, తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్, మేకల అక్షయ్ కుమార్ హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు సోమవారం రోజున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావును కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, కృతఙ్ఞతలు తెలియజేశారు.
Also Read : కనీస సౌకర్యాల పై శ్రద్ధలేదు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube