ఇంతటి సభా ఎప్పుడు జరగలేదు

విజయవంతం కి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

0
TMedia (Telugu News) :

ఇంతటి సభా ఎప్పుడు జరగలేదు

-విజయవంతం కి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

-కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

టీ మీడియా, జనవరి 19, హైదరాబాద్ : ఖమ్మం లో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి అజయ్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం హైదరాబాద్ బిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి గొప్ప బహిరంగ సభలో ఖమ్మంలో నిర్వహించే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం ప్రజలందరికీ నిజమైన సంక్రాంతి బుధవారం జరిగింది అని అజయ్ అన్నారు. సభ జయప్రదం కావడానికి అహర్నిశలు ఖమ్మంలోనే ఉంటూ టీం లీడర్ గా అందర్నీ కార్యముకులుగా చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి మరియు కోఆర్డినేట్ చేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : తెలంగాణ‌లో డ‌బ్ల్యూహెచ్‌వో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హ‌బ్

అదేవిధంగా సహకరించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు ఎంపీలు నామ నాగేశ్వరరావు,వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధి రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, హరిప్రియ, రేగ కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు,మెచ్చ నాగేశ్వరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎమ్మెల్సీతాత మధు,మాజీ ఎమ్మెల్సీ బాలసాని గార్లలతో పాటు అశేష జనవాహిని రావడానికి పని చేసిన ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు అజయ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ నాయకులు ఖమ్మం సభ ద్వారా దేశానికి దిశా నిర్దేశం చేయడం ఖమ్మం ప్రజల అదృష్టం అని మంత్రి అజయ్ స్పష్టం చేశారు. కేవలం పది రోజుల్లో ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నిత్యం కవరేజ్ అందించిన మీడియా మిత్రులకు మంత్రి పువ్వాడ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారీ బహిరంగ సభ తో పాటు నూతన సమీకృత కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవం మరియు కంటి వెలుగు రెండో దశ ప్రారంభించుకోవటం మంచి పరిణామం అని మంత్రి అజయ్ అన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు 24 గంటల కరెంటు గురించి సందేహాలు ఉంటే ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకోవాలని సభతో దేశ రాజకీయాలే కాదు ఖమ్మం రాజకీయాలు కూడా మారుతాయి అని మంత్రి అజయ్ స్పష్టం చేశారు.
కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన సభ. రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు . ఈ సభ పాత్ర దారులు, సూత్ర దారులకు శిరస్సు వహించి నమస్కరిస్తున్నాం. కరీంనగర్ సభ 2001 లో తెలంగాణ ఏర్పాటు కు బాటలు వేసినట్టే ఖమ్మం సభ జాతీయ రాజకీయాల్లో మార్పులకు నాంది కానుంది .ప్రగతి శీల శక్తుల కలయిక కు ఖమ్మం సభ బాటలు వేసింది. ఎవరేమనుకున్నా ఖమ్మం సభ చాలా పద్దతిగా జరిగింది. దేశ సంపదను ఇద్దరు గుజారాతి లు మరో గుజారాతీ కి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read : చిత్తారమ్మదేవి జాతర ఏర్పాట్లు పూర్తి

ఈ ఆటలు చెల్లవు గాక చెల్లవు అని ఖమ్మం సభ సందేశం ఇచ్చింది. ఖమ్మం సభ విజయాల పరంపర ను నమోదు చేసుకుంది.తెలంగాణ లో ఉచిత విద్యుత్ ను ఇస్తున్నట్టే దేశ వ్యాప్తంగా ఇస్తాం. విద్యుత్ రంగాన్ని కూడా ఆదానీ కి కట్టబెట్టే కుట్ర జరుగుతోంది దీన్ని కూడా ఉద్యోగులతో కలిసి ప్రతిఘటిస్తాంరైతుల ఆందోళనలకు బీ ఆర్ ఎస్ మద్దతు ఇస్తుంది. ఖమ్మం సభ ఆరంభం మాత్రమేఢిల్లీ రాజకీయాల్లో బీ ఆర్ ఎస్ కచ్చితమైన మార్పు దిశగా అడుగులు వేస్తుంది. 2014 లో ధనవంతుల జాబితాలో ఆదానీ ది 604 ర్యాంకు.. ఇపుడు మొదటి స్థానానికి ఎలా ఎగబాకారు.. బీజేపీ నేతలు చెప్పాలి. ఆధారాలు లేకుండా అవినీతి పై ఆరోపణలు చేసే వారి గురించి మాట్లాడలేము.బండి సంజయ్ కు వ్యవసాయం గురించి కరెంటు గురించి ఏం తెలుసుసభ లో ఎంత మంది జనాలు ఉన్నారో బయట అంతమంది జనాలు ఉన్నారు. బీ ఆర్ ఎస్ ప్రబలమైన శక్తిగా మారడానికి ఖమ్మం సభ బాటలు వేయబోతోంది.ఖమ్మం సభ తో బీజేపీ కి జిల్లాలో స్థానం లేదని తేలిపోయింది. బీజేపీ కి ఖమ్మం లో డిపాజిట్లు కూడా రావు…ఖమ్మం లో బీ ఆర్ ఎస్ పదికి పది స్థానాలు రావడం ఖాయం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube