పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశం
టీ మీడియా, జనవరి 31, ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోని పొత్కపల్లి గ్రామం లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు ,గ్రామంలో కులవివక్ష ఉందా రెండు గ్లాసుల విధానం ఉందా గుడిలోకి ప్రవేశం ఉందా లేక ఏమైనా వివక్షకు గురవుతున్నారా అని అడుగగా అలాంటి పరిస్థితులు మా గ్రామంలో లేవని అందరం సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తామని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ నుండి కానిస్టేబుల్ రాజేందర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శనిగరపు రమేష్ శనిగరపు రాములు రాంచెందర్ శంకర్ సారయ్య రాజయ్య అంబాల పోచయ్య గడ్డం కొమురయ్య ఓదెలు సలిగంటి వెంకటేష్ చెరుకు శేఖర్ శనిగరపు మధు మల్లయ్య బురగాల రాజు గడ్డం రాజేశం విఆర్ ఏ లు తదితరులు పాల్గొన్నారు.