టీ మీడియా అక్టోబర్ 25: వెంకటాపురం (ములుగు)
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కమ్మరిగూడెం గ్రామంలో ఆదివాసీలతో సోమవారం సమావేశం జరిగింది . ఈ సమావేశంలో ఆదివాసీ సీనియర్ నాయకులు పూనెం సాయి మాట్లాడుతూ శ్రీ ॥ కోనేరు రంగారావు గారి కమిటీ సిఫార్సులను రెవెన్యూ అధికారులు తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . గతంలో ములుగు సబ్ కలెక్టర్ విధులు నిర్వహించిన వి.పి గౌతమ్ ఐ.ఎ.ఎస్ వెంకటాపురం టౌన్ పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించి ఆ ప్రభుత్వ భూములకు దిమ్మెలు నిర్మించి వాటికి రక్షణ కల్పించారు . ఆ దిమ్మెలకు ఇప్పుడు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వభూములను గిరిజనేతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని భహుళ అంతస్తు భవనాలు కడుతుంటే రెవెన్యూ యంత్రాంగం మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని కోనేరు రంగారావు కమిటిసిఫార్సులకు వ్యతిరేకంగా భహుళ అంతస్తు భవనాలకు ఇసుక పర్మిషన్ రెవెన్యూ అధికారులు ఎలా ఇస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు .
గిరిజనేతరులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై 1/70 చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు . భారత రాజ్యాంగం 5,6 షెడ్యూల్డ్ ప్రకారంగా భూమిపై , నీటిపై , అడవిపై సర్వహక్కులు ఆదివాసీలవే అని రాజ్యాంగం చెబుతుంటే కోనేరు రంగారావు కమిటి సిఫార్సులు రెవెన్యూ అధికారులు ఎందుకు అమలు చేయటం లేదని ఆయన మండి పడ్డారు . అక్రమ భవనాలకు విధ్యుత్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు . అక్రమ భవనాలు నిలుపుదల చేయకపోతే తహాశీల్దార్ కార్యాలయం ఎదుట వచ్చేవారం నుండి రిలే నిరహార దీక్షలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు . ఈ సమావేశంలో తాటి . నర్సింహారావు , పూనెం . సూర్యం , సూరయ్య తదితరులు పాల్గొన్నారు .