టీ మీడియా డిసెంబర్ 9 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో గురువారం రోజు వనపర్తి పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తా దగ్గర తెలంగాణ తల్లి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు జరగకూడదని తెలియజేశారు. ఎందుకంటే భారత దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన టువంటి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రయాణంలో ఆయనతో పాటు 11 మంది మరణించడం జరిగింది. కావున సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జరగదని డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది కావున కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి డిజిటల్ సభ్యత్వం ప్రారంభించడం జరిగింది. అనంతరం రక్షణ దళంలో కీలక పాత్ర వహించిన బిపిన్ రావత్ కి శ్రద్ధాంజలి ఘటించి జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి తిరుపతి పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
