శ్లోక కంఠస్థ పోటీలో ప్రతిభ చాటిన విద్యార్థినీలు
లహరి, ఫిబ్రవరి 1, ఖమ్మం : మాఘమాసం భీష్మ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని ఖమ్మం తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టీటీడీ కార్యాలయంలో విద్యార్థిని విద్యార్థులకు అచ్యుతాష్టకం విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోక కంఠస్థ పోటీలను నిర్వహించారు. పది సంవత్సరాల లోపు విద్యార్థిని విద్యార్థులకు అచ్యుతాష్టకం 15 సంవత్సరాల లోపు విద్యార్థినీ విద్యార్థులకు విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలలో నగరంలోని రామకృష్ణ మాంటిసోరి శ్రీ చైతన్య వివేకానంద టైని టాట్స్ గోర్కి పబ్లిక్ స్కూల్ రిజోనెన్స్ విద్యాలయాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణయతలుగా కే సురేఖ విలాసాగరపు వెంకటేశ్వర్లు వ్యవహరించారు. అచ్చుతాష్టకం కంటస్థ పోటీలలో ప్రథమ విజేతగా లక్ష్మీ ది మహి ద్వితీయ విజేతగా శశిశేఖర్ అకుల్ తృతీయ విజేతగా ఎస్ కె నైఫా లు నిలిచారు. విష్ణు సహస్రనామ స్తోత్ర కంఠస్థ పోటీలలో ప్రథమ విజేతగా వల్లి వాగ్దేవి ద్వితీయ విజేతగా హిరణ్ మై తృతీయ విజేతగా మోహిత్ కృష్ణ లు నిలిచారు.
Also Read : భవన నిర్మాణ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి
అనంతరం జరిగిన సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇస్కాన్ కు చెందిన రాఘవ ప్రభు పాద స్వామి చేతుల మీదుగా రామాయణం భాగవతం మహాభారతం గ్రంథాలను విజేతలకు అందజేశారు ఈ కార్యక్రమంలో టిటిడి ధార్మిక కార్యక్రమంల తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అధికారి చతుర్వేదుల సత్యనారాయణ ఆదేశం మేరకు ఖమ్మం ఉమ్మడి జిల్లాల తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం కన్వీనర్ కర్నాటి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సామాజిక సమరస్త వేదిక రాష్ట్ర కన్వీనర్ కేసర జయపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కే కోటిరెడ్డి పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube